MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!

Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!

2026 ఇంకా సగమైనా పూర్తి కాలేదు, అప్పుడే 2027 క్యాలెండర్ భారీ సినిమాలతో నిండిపోతోంది. ఆ ఏడాది బాక్సాఫీస్ దగ్గర  వేల కోట్ల బిజినెస్ జరగబోతోంది. నెక్ట్స్ ఇయర్   రాబోతున్న టాప్ పాన్ ఇండియా సినిమాలేంటి వాటి బడ్జెట్ వివరాలు చూస్తే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2026, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
2027 రిలీజ్ లో భారీ పాన్ ఇండియా సినిమాలు..
Image Credit : X

2027 రిలీజ్ లో భారీ పాన్ ఇండియా సినిమాలు..

2026 ఆఫ్ ఇయర్ కూడా పూర్తి కాాలేదు.. కానీ 2027 సినిమాలపై ఇప్పటి నుంచే క్రేజ్ భారీగా పెరిగిపోతోంది. నెక్ట్స్ ఇయర్  రిలీజ్‌ల కోసం భారీ సినిమాలు క్యూ కట్టాయి. ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, యశ్, రాజమౌళి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలేంటి? ఏయే తేదీల్లో రాబోతున్నాయంటే..?

27
ప్రభాస్ స్పిరిట్
Image Credit : X

ప్రభాస్ స్పిరిట్

ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం 'స్పిరిట్'. వివాదాస్పద దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన గతంలో అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. . ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఓ సౌత్ కొరియన్ నటుడు విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

Related Articles

Related image1
Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
Related image2
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
37
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్
Image Credit : Instagram

మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్

2027లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ మూవీ 'వారణాసి' కూడా ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న  ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్లలోకి రానుంది.

47
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ..
Image Credit : instagram

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ..

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈసినిమా  ‘డ్రాగన్’ వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది.  ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా 2027లోనే రిలీజ్ చేయనున్నారు. 2027 జూన్ 11న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. 

57
అల్లు అర్జున్ రాకా...
Image Credit : X

అల్లు అర్జున్ రాకా...

2027లో రిలీజ్ కానున్న భారీ చిత్రాల జాబితాలో అల్లు అర్జున్ 'రాకా' కూడా ఉంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో.. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కూడా 2027లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

67
తలైవర్ 173
Image Credit : X / Raaj Kamal Films International

తలైవర్ 173

2027లో రిలీజ్ కానున్న మొదటి భారీ చిత్రం 'తలైవర్ 173'. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మొదట సుందర్ సి దర్శకుడిగా అనుకున్నా, ఆయన తప్పుకోవడంతో సిబి చక్రవర్తి చేతికి వెళ్లింది. ఇప్పుడు అతను కూడా తప్పుకున్నాడని, అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాను 2027 పొంగల్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
77
రామాయణ
Image Credit : Youtube@WorldOfRamayana

రామాయణ

హిందీలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం 'రామాయణ'. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. యశ్, సాయి పల్లవి సీతగా కీలక పాత్రల్లో నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
అల్లు అర్జున్
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka Movie: ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. 'రాకా'లో దీపిక పాత్రకు కత్తెర? మేకర్స్ ఫుల్ క్లారిటీ
Recommended image2
Sukesh Chandrashekhar: 'నువ్వు ఎప్పటికీ నా దానివే'.. జాక్వెలిన్‌కు సుకేశ్ ప్రేమలేఖ, సోషల్ మీడియాలో వైరల్
Recommended image3
Koratala Siva: కొరటాల, బాలయ్య కాంబినేషన్ కి యామా క్రేజ్, ఎందుకు.. కానీ బ్యాడ్ సెంటిమెంట్ ?
Related Stories
Recommended image1
Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
Recommended image2
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved