MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!

Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!

‘పుష్ప 3’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చని టాక్ నడుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 31 2026, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న హాట్ టాపిక్
Image Credit : INSTAGRAM

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న హాట్ టాపిక్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ నటించిన 'పుష్ప' సినిమా సృష్టించిన ప్రభంజనం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా, దీని రెండో భాగం (పుష్ప 2) ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిందని, బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డు సృష్టించిందని సోర్స్ చెబుతోంది. ఇటీవల ఈ సినిమాను జపనీస్ భాషలోకి డబ్ చేసి జపాన్‌లో విడుదల చేయగా, అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, 'పుష్ప 3' ఎప్పుడు వస్తుంది? అందులో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉంటాయి? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు, లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటో చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
‘పుష్ప 3’ రిలీజ్‌పై జగపతి బాబు క్లారిటీ
Image Credit : instagram

‘పుష్ప 3’ రిలీజ్‌పై జగపతి బాబు క్లారిటీ

పుష్ప 2 చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' గురించి ఒక ముఖ్యమైన విషయం పంచుకున్నారు. "చాలా మంది అనుకుంటున్న దానికంటే వేగంగా, అంటే మరో ఏడాది, రెండేళ్లలోనే 'పుష్ప 3' పనులు మొదలవుతాయి. మూడో భాగంలో నా పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు సుకుమార్ నాతో చెప్పారు" అని ఆయన తెలిపారు. దీన్నిబట్టి మూడో భాగంలో ఫైట్ ఇంకా గట్టిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
34
బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ ఎంట్రీ?
Image Credit : Instagram

బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ ఎంట్రీ?

'పుష్ప' బ్రాండ్‌ను పాన్-ఇండియా స్థాయిలో మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు మైత్రీ మూవీ మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా, పుష్ప 3లో ఒక మాస్ క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ పాత్రతోనే ఒక ప్రత్యేక స్పిన్-ఆఫ్ సినిమా తీసే ఆలోచన కూడా నిర్మాతలకు ఉందని టాక్. అయితే, పుష్పలో సల్మాన్ ఖాన్ ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
44
రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది?
Image Credit : instagram

రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది?

నిర్మాతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, 'పుష్ప 3' సినిమా 2028 నాటికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలస్యానికి బలమైన కారణమే ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. ఈ మెగా ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఆయన మళ్లీ 'పుష్ప'గా మారతారు. అదేవిధంగా, దర్శకుడు సుకుమార్ కూడా తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రస్తుత కమిట్‌మెంట్లను పూర్తి చేశాక, 'పుష్ప 3' పనులను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ విలనిజం, జగపతి బాబు పవర్‌ఫుల్ క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ క్యామియో అంచనాలతో 'పుష్ప 3' థియేటర్లను షేక్ చేయడం ఖాయం!

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved