MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas Sreenu: తాగుడు మానేశాకే సమస్యలు.. నా కూతురు, అల్లు అర్జున్ కోసమే ఆ నిర్ణయం.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్

Prabhas Sreenu: తాగుడు మానేశాకే సమస్యలు.. నా కూతురు, అల్లు అర్జున్ కోసమే ఆ నిర్ణయం.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్

నటుడు ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో తన తాగుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్ హీరో చెప్పిన మాటతోనే తాను డ్రింకింగ్ మానేసినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 28 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prabhas Sreenu
Image Credit : Asianet News

Prabhas Sreenu

డార్లింగ్, గబ్బర్ సింగ్, విక్రమార్కుడు లాంటి సినిమాల్లో నవ్వుల జల్లులు కురిపించిన కమెడియన్ ప్రభాస్ శ్రీను. ప్రభాస్ సినిమాల్లో నటించడం, ప్రభాస్ తో స్నేహం వల్ల అతడు ప్రభాస్ శ్రీను అయ్యారు. ప్రభాస్ శ్రీను గబ్బర్ సింగ్ మూవీలో కామెడీకి గాను బెస్ట్ కమిడియన్ గా సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తాగుడు మానేయాలనుకున్నప్పుడు సమస్యలు
Image Credit : Asianet News

తాగుడు మానేయాలనుకున్నప్పుడు సమస్యలు

అయితే ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో తనకు విపరీతమైన తాగుడు అలవాటు ఉంది అని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు. తాగుడు వల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోయింది అని వార్తలు వచ్చాయి కదా అని యాంకర్ అడగగా.. ఆరోగ్యం పాడు కాలేదు అని ప్రభాస్ శ్రీను తెలిపారు. నేను తాగుతాను కానీ మరీ అతిగా తాగలేదు. సమస్య ఎక్కడ వచ్చింది అంటే.. నేను మానేయాలి అని అనుకున్నప్పుడే సమస్య మొదలైంది.

35
అల్లు అర్జున్ మూవీ షూటింగ్ లో సంఘటన
Image Credit : Asianet News

అల్లు అర్జున్ మూవీ షూటింగ్ లో సంఘటన

నేను రెగ్యులర్ గా తాగుతున్నప్పుడు నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నా కూతురు ఎదుగుతోంది.. ఇక మానేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అల్లు అర్జున్ గారి నాపేరు సూర్య మూవీ షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ తోనే సీన్. ఆయనకు నేను చేయి అడ్డు పెట్టి డైలాగ్ చెప్పాలి. రాత్రి తొమ్మిదిన్నరకు షూటింగ్ జరుగుతోంది. నా చేయి వణకడం అల్లు అర్జున్ గమనించారు.

45
మీ అంతట మీరే మానేయాలి
Image Credit : Asianet News

మీ అంతట మీరే మానేయాలి

ఏంటి శ్రీను గారు చేయి వణుకుతోంది అని అడిగారు. తొమ్మిదిన్నర అయింది కదా సార్ ఆ టైం కి పడకపోతే మనకు షివరింగ్ ఆగదు అని చెప్పా. నా వైపు పైకి కింది ఒకసారి చూసి.. ఒకరు మానేయమంటే మానేసేది కాదిది.. మీ అంతట మీరే మానేయాలి. ఎంత మంచి నటుడు మీరు అని ఒక్క లుక్కు ఇచ్చి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ చూసిన ఆ చూపు నాకు ఫటా ఫటా అంటూ చెంపదెబ్బలు కొట్టినట్లు అనిపించింది.

55
పూర్తిగా తాగుడు మానేశా
Image Credit : Asianet News

పూర్తిగా తాగుడు మానేశా

అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్.. ఆయన నా ఆరోగ్యం కోసం ఆలోచించాల్సిన అవసరం ఏముంది.. వీడు తాగుబోతు అయితే మనకేంటి అని ఆయన సైలెంట్ గా ఉండొచ్చు. కానీ మీరు మంచి నటుడు అని, మానేయాలి అని చెప్పారు. అల్లు అర్జున్ చెప్పిన తర్వాత నాలో ఆలోచన మొదలైంది. నా కూతురి కోసం, అల్లు అర్జున్ చెప్పిన మాటతో ఇప్పుడు తాగుడు పూర్తిగా మానేసినట్లు ప్రభాస్ శ్రీను తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Thrillers: నవలల ఆధారంగా తెరకెక్కిన 5 థ్రిల్లర్ సినిమాలు..ట్విస్టులే ట్విస్టులు, ఓటీటీలో అస్సలు వదలొద్దు
Recommended image2
Rajasekhar: ఆ కారణంతోనే నా కెరీర్‌ ట్రాక్‌ తప్పింది, లేదంటే మెగాస్టార్‌ రేంజ్‌.. నిజాన్ని ఒప్పుకున్న రాజశేఖర్‌
Recommended image3
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
OTT Thrillers: నవలల ఆధారంగా తెరకెక్కిన 5 థ్రిల్లర్ సినిమాలు..ట్విస్టులే ట్విస్టులు, ఓటీటీలో అస్సలు వదలొద్దు
Recommended image2
ANR: నాగార్జునని పొగడడం అప్పటి వరకు జరగదు, అలాంటి సినిమాలు చేస్తేనే.. సొంత కొడుక్కే షాకిచ్చిన ఏఎన్నార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved