- Home
- Entertainment
- Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
పూరి జగన్నాధ్ ఫ్యామిలీ 5 ఏళ్ళ పాటు నరకం అనుభవించారు. ఆ టైంలో పిల్లల విషయంలో పూరి జగన్నాధ్ భార్య తీసుకున్న నిర్ణయం ఊహించనిదే అనే చెప్పాలి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

పూరి జగన్నాధ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బద్రి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. టాలీవుడ్ లో ఇడియట్, పోకిరి లాంటి గేమ్ ఛేంజింగ్ సినిమాలు తెరకెక్కించారు.అంతే కాదు అగ్ర హీరోలకు సూపర్ హిట్ సినిమాలు అందించారు. పూరి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయన దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కోరుకునేవారు.

పూరి జగన్నాధ్ ఆర్థిక కష్టాలు
ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఫామ్ బాగా డౌన్ అయింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతితో ఓ చిత్రం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ కి క్రేజ్ ఉన్న టైంలోనే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. ఆ టైంలో పూరి జగన్నాధ్ కొందరిని నమ్మి మోసపోవడం వల్ల వందల కోట్లల్లో ఆస్తులు, డబ్బు కోల్పోయారు.
పూరి జగన్నాధ్ భార్య ఏం చేశారో తెలుసా ?
కనీసం పెంపుడు కుక్కలని కూడా పోషించలేని పరిస్థితికి తాను చేరుకున్నట్లు పూరి ఓ సందర్భంలో తెలిపారు. దీని గురించి పూరి తనయుడు ఆకాష్ పూరి ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో నేను మా చెల్లి చిన్న పిల్లలం. ఆ ఆర్థిక సమస్యలు, ఇంట్లో కష్టాలు మాకు తెలియకూడదు అని అమ్మ మమ్మల్ని హాస్టల్ లో చేర్పించింది.
5 ఏళ్లపాటు నరకం
ఆమె నాన్నకు ఒక పిల్లర్ లా సపోర్ట్ ఇచ్చింది. ఇల్లు ఆస్తులు అన్నీ కోల్పోయాం. మేము చిన్న పిల్లలం కాబట్టి మాకు తెలియదు. ఆ తర్వాత ఆ విషయాలు నాకు తెలిశాయి. 5 ఏళ్ల పాటు మా ఫ్యామిలీ నరకం అనుభవించాం అని ఆకాష్ పూరి తెలిపారు.
అందులో నిజం లేదు
అదే సమయంలో పూరి జగన్నాధ్ కి, ఆయన సతీమణి లావణ్యకి విభేదాలు వచ్చాయని విడిపోతున్నట్లు కూడా ప్రచారం చేశారు. దీని గురించి ఆకాష్ పూరిని ప్రశ్నించగా అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. నాన్న చెబితే విన్నాను. నాన్న దగ్గర 200 రూపాయలు కూడా లేని టైంలో అమ్మ పెళ్లి చేసుకుంది. కష్టాల్లో నాన్నతో ఎప్పుడూ అమ్మ తోడుగా ఉంది. వాళ్ళ మధ్య విభేదాలు ఎప్పుడూ లేవు అని ఆకాష్ పూరి తెలిపారు.

