MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి

Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి

బుల్లితెర, వెండితెర తారలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న తారలు కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 20 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉయ్యాల జంపాల సినిమాతో..
Image Credit : our own

ఉయ్యాల జంపాల సినిమాతో..

తెలుగు ఆడియెన్స్‌కు పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు దృష్టిని ఆకర్షించింది. ఈసినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన పునర్నవి.. ఆతరువాత తెలుగులో చాలా సినిమాల్లో నటించిమెప్పించింది. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం..
Image Credit : our own

రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం..

టాలీవుడ్ లో పునర్నవి చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అవకాశం రావడంతో.. మరింత గుర్తింపు పొందింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి వార్తల్లో నిలిచింది. హౌస్ లో వీరి తీరు చూసిన జనాలు.. బయటకు వచ్చిన తరువాత ప్రేమలో మునిగిపోయి.. పెళ్లి కూడా చేసుకుంటారేమో అనుకున్నారు. కానీ ఆ అనుబంధం షో ముగిసిన తర్వాత కొనసాగలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు.

Related Articles

Related image1
రాజమౌళి మహాభారతంలో బాలయ్య, జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో బాలకృష్ణ పాత్ర ఏంటో తెలుసా?
Related image2
25 నిమిషాల సీన్ కోసం 300 కోట్ల ఖర్చు, వారణాసి నుంచి బాహుబలి వరకు అత్యంత ఖరీదైన సన్నివేశాలు ఇవే..
35
పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ
Image Credit : instagram.com/punarnavib

పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ

రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్.. మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. తాజాగా పునర్నవి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసిన ఆమె, తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. గురువారం, ఫిబ్రవరి 19న పునర్నవి – హేమంత్ వర్మ నిశ్చితార్థ వేడుక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అదే సందర్భంగా లగ్నపత్రిక కూడా రాసుకున్నారు.

45
ప్రేమించిన ప్రియుడితో పునర్నవి నిశ్చితార్థం
Image Credit : instagram.com/punarnavib

ప్రేమించిన ప్రియుడితో పునర్నవి నిశ్చితార్థం

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునర్నవి స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. నీలిరంగు చీరలో ఆమె ఎంతో అందంగా కనిపించింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మాత్రం తన సింగిల్ ఫోటోలనే షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. పెళ్లి కొడుకు ఫోటోలను మాత్రం ఆమె షేర్ చేయలేదు.

55
పునర్నవి కాబోయే భర్త ఎవరు?
Image Credit : instagram.com/punarnavib

పునర్నవి కాబోయే భర్త ఎవరు?

ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పునర్నవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పునర్నవికి కాబోయే వరుడు హేమంత్ వర్మ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ట్రావెలర్‌ అని తెలుస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image3
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Related Stories
Recommended image1
రాజమౌళి మహాభారతంలో బాలయ్య, జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో బాలకృష్ణ పాత్ర ఏంటో తెలుసా?
Recommended image2
25 నిమిషాల సీన్ కోసం 300 కోట్ల ఖర్చు, వారణాసి నుంచి బాహుబలి వరకు అత్యంత ఖరీదైన సన్నివేశాలు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved