మోక్షజ్ఞ సినిమాపై రూమర్లు నమ్మకండి, అవన్నీ ఫేక్.. అప్ డేట్లు మేమే ఇస్తాం
నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సినిమాకి సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై టీమ్ స్పందించింది. ఓ క్లారిటీ ఇచ్చింది.
Mokshagna Nandamuri
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయి. మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ప్రశాంత్ వర్మతో ఉంటుందని ప్రకటించారు. పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మోక్షజ్ఞ అనారోగ్యం కారణంగా ప్రారంభం లేదు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆగిపోయిందనే రూమర్లు ప్రారంభమయ్యాయి. ప్రశాంత్ వర్మ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని ఒకటి, తన అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాడని మరో రూమర్ వినిపించింది. ఇదే కాదు అసలు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే కొత్త వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికి మరో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. `కల్కి 2898 ఏడీ` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందనేది కొత్త రూమర్.
Mokshagna Nandamuri
ఇలాంటి అనేక రూమర్లు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై టీమ్ స్పందించింది. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే వార్తలపై స్పందిస్తూ, ఈ రూమర్లు అన్ని నిజం కావు అని, అవన్నీ ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ అప్ డేట్ అయినా తాము అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తప్పుడు వార్తలు, రూమర్లని నమ్మవద్దు అని, ఎలాంటి ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ చేయోద్దని తెలిపింది. తమపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ లెక్కన మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను త్వరలోనే వెల్లడించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకాలపై తేజస్విని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని సోషియో ఫాంటసీగా తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వలో మోక్షజ్ఞ సినిమా అనేది వాస్తవం కాదని అర్థమవుతుంది.