MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ.. బాలయ్య వారసుడి ఎంట్రీలో మరో ట్విస్ట్ ? తెరపైకి మరో దర్శకుడి పేరు

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ.. బాలయ్య వారసుడి ఎంట్రీలో మరో ట్విస్ట్ ? తెరపైకి మరో దర్శకుడి పేరు

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన మరో క్రేజీ వార్త లీక్‌ అయ్యింది. `కల్కి` దర్శకుడు రూపొందిస్తారని సమాచారం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 18 2024, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mokshagna Nandamuri

Mokshagna Nandamuri

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతుంది. ఆయన హీరోగా రెడీ అవ్వడానికి మూడు నాలుగేళ్లు పట్టింది. ఇప్పుడు ఆయన హీరోగా సినిమా ప్రారంభానికి బాలయ్య మల్లగుల్లాలు పడుతున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించిన సినిమాని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇది ఆగిపోయిందట.  

read more: శృతి హాసన్‌ స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌, గన్‌ పట్టుకుని ఊర మాస్‌ లుక్‌, సినిమా ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Mokshagna

Mokshagna

`హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ లుక్‌తో పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగానూ మారారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందట. డిసెంబర్‌ 5న ప్రారంభం కావాల్సిన ఈ మూవీ స్టార్ట్ కాలేదు. మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగా లేదని, అందుకే ఆగిపోయిందని తెలిపారు బాలయ్య. ఏదైనా మన మంచికే అన్నారు. 

36
Mokshagna Nandamuri

Mokshagna Nandamuri

అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ ఆగిపోయిందట. ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించడని, తన శిష్యుడు డైరెక్ట్ చేస్తాడని చెప్పడంతో బాలయ్యకి మండిందట. మరోవైపు తాను దర్శకత్వం వహించాలంటే భారీగా పారితోషికం డిమాండ్‌ చేశాడట. సినిమాకి 15కోట్ల పారితోషికంతోపాటు, లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడుగుతున్నాడట. దీంతో ఆయన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. 
 

46

మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ సినిమా అనుకున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో మోక్షజ్ఞతో సినిమా చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఇది మోక్షజ్ఞకి సరైన ఎంట్రీలా ఉండదని బాలయ్య భావిస్తున్నారట. తొలి సినిమా చాలా గ్రాండ్‌గా, ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.

also read: సమంతకి స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఫామ్‌ హౌజ్‌ గిఫ్ట్.. కొడుకు కోసం నిర్మాత అంతటి సాహసం ?
 

56

`మహానటి`, `కల్కి 2898 ఏడీ` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందనే వార్తలు ప్రారంభమయ్యాయి. నాగ్‌ అశ్విన్‌తో బాలయ్య చర్చలు జరుపుతున్నారట. ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం అటు బాలయ్య ఫ్యాన్స్ ని, ఇటు నార్మల్‌ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మరోవైపు `ఆదిత్య 999` చేయడానికి బాలయ్య ప్లాన్‌ చేస్తున్నారు.
 

66

అయితే నాగ్‌ అశ్విన్‌.. ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ` సినిమాని తెరకెక్కించారు. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు `కల్కి 2`పై వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ కావడానికి ఏడాదిపైనే టైమ్‌ పడుతుంది. ఈ క్రమంలో ఈ లోపు మోక్షజ్ఞ సినిమా ఉండే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం, ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందనేది చూడాలి. 

read more: మోక్షజ్ఞ సినిమాలో మహేష్ బాబు లక్కీ హీరోయిన్, ఏ పాత్ర చేయబోతోంది..?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ్ అశ్విన్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved