MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే

Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే

సుమన్, భానుప్రియ జంటగా నటించిన ఓ మూవీపై సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. రిలీజ్ కి ముందే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అని అనుకున్నారు. కట్ చేస్తే ఆ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 13 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suman
Image Credit : Asianet News

Suman

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా పోటీ ఇచ్చిన హీరో సుమన్. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనల కారణంగా సుమన్ వెనుకబడ్డారు. సుమన్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్ లో సితార అనే చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ డైరెక్టర్ వంశీకి రెండవ సినిమా మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శంకరాభరణం నిర్మాత
Image Credit : sun nxt

శంకరాభరణం నిర్మాత

ఈ చిత్రాన్ని సాగర సంగమం, సీతా కొక చిలుక, శంకరాభరణం లాంటి అద్భుతమైన దృశ్య కావ్యాలని రూపొందించిన నిర్మాత ఏడిద నాగేశ్వర రావు నిర్మించారు. షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్ వంశీకి తీవ్ర అవమానం జరిగింది. వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ పూర్తయ్యాక చెన్నైలోని రామానాయుడు గారి స్టూడియోలో ఆర్ఆర్ లేకుండా మూవీ ప్రీవ్యూ షో వేశాము.

35
వీడికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా
Image Credit : youtube print shot/Idream media

వీడికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా

సినిమాని చాలా మంది చూశారు. డైలాగులు ఎక్కువ లేవు, కామెడీ లేదు. అందరికీ సినిమా విపరీతంగా బోర్ కొట్టేసింది. ఏడిద నాగేశ్వర రావు అయితే.. శంకరాభరణం లాంటి దృశ్య కావ్యం తీసిన నిర్మాతని నేను. పొరపాటున వీడికి అవకాశం ఇచ్చి ఎంత తప్పు చేశాను అని అన్నారు. ఈ మూవీ ఫ్లాప్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ మరుసటి రోజు ఇళయరాజా గారు సినిమా చూశారు. అప్పటికే ఏడిద నాగేశ్వర రావు గారికి ఈ మూవీపై ఆసక్తి పోయింది.

45
ఇళయరాజా ప్రశంసలు
Image Credit : our own

ఇళయరాజా ప్రశంసలు

ఇక ఎలాగోలా రిలీజ్ చేయాలి కదా అనే ఉద్దేశంలో మాత్రమే మిగిలిన వర్క్ చేస్తున్నారు. ఇళయరాజా గారు సినిమా చూస్తూ డైరెక్టర్ ఎక్కడా అని అడిగారు. ఇక్కడే ఎక్కడో ఉంటాడులే.. అతనితో ఏం పని ఇప్పుడు అంటూ చిరాగ్గా సమాధానం ఇచ్చారు. అయినా కూడా ఇళయరాజా గారు వెతికి నన్ను పిలిచారు. ఇలా రావయ్యా. చాలారోజుల తర్వాత నేను అద్భుతంగా పనిచేసేందుకు ఒక మంచి సినిమా దొరికింది. చాలా మంచి సినిమా ఇచ్చావ్. రేపటి నుంచి నా సంగీతంతో దీనిపని చెబుతా అని ఇళయరాజా గారు వెళ్లిపోయారు. ఎవ్వరికీ నచ్చని మూవీ ఆయనకు మాత్రమే నచ్చింది అని వంశీ తెలిపారు.

55
భానుప్రియకి డెబ్యూ మూవీ
Image Credit : stockPhoto

భానుప్రియకి డెబ్యూ మూవీ

ఇళయరాజా లాంటి లెజెండ్ కి నా సినిమా నచ్చడంతో నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మూవీ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతకు మించే విధంగా నేషనల్ అవార్డ్స్ లో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఏకంగా 3 నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది. ఓ నంది అవార్డు కూడా గెలుచుకుంది. దీనితో టాలీవుడ్ లో వంశీ పేరు మారుమోగింది. సుమన్, భాను ప్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి. భానుప్రియకి ఇది డెబ్యూ మూవీ. వాస్తవానికి రాధాని ఈ మూవీలో హీరోయిన్ గా అనుకున్నారు. బడ్జెట్ కారణాల వల్ల భానుప్రియని తీసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Recommended image2
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image3
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved