- Home
- Entertainment
- Allari Naresh: అల్లరి నరేష్ డైరెక్ట్ చేసిన ఏకైక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Allari Naresh: అల్లరి నరేష్ డైరెక్ట్ చేసిన ఏకైక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Allari Naresh: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కామెడీకి కొత్త అర్థం చెప్పిన హీరోలలో ఆయన ఒకరు. అయితే నటుడిగా ప్రేక్షకులను అలరించిన నరేష్.. ఒక సినిమాను డైరెక్ట్ చేశాడని మీకు తెలుసా?

కామెడీ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు
అల్లరి నరేష్ సినీ ప్రయాణంలో హాస్యానికి పెద్దపీట వేసే పాత్రలు ఎన్నో ఉన్నాయి. తనదైన టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరో ఇమేజ్ ఆరేంజ్ లో సాధించింది అల్లరి నరేష్ ఒక్కడే. చాలా మంది ట్రై చేసినా.. సక్సెస్ అవ్వలేకపోయారు. కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్స్ ను కూడీ పిండేశాడు నరేష్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తన పరిధిని విస్తరించుకున్నారు.
అనుకోని పరిస్థితుల్లో మెగా ఫోన్ పట్టిన హీరో..
అల్లరి నరేష్ తన జీవితంలో ఒకే ఒక్క సారి మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నరేష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి కారణమైన సినిమా మరేదో కాదు 'బెండు అప్పారావు RMP'. ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న సమయంలో అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. సినిమా చిత్రీకరణ పూర్తికావడానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఈవీవీ అనారోగ్యానికి గురయ్యారని సమాచారం.
తండ్రి స్థానంలో నిలబడి షూటింగ్ పూర్తి
ఆ సమయంలో సినిమా నిర్మాణం ఆగిపోకుండా ఉండేందుకు అల్లరి నరేష్ ముందుకొచ్చారు. మిగిలిన నాలుగు రోజుల చిత్రీకరణకు సంబంధించిన బాధ్యతలను స్వీకరించి, షూటింగ్ పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు నటుడిగా తన పాత్రను కొనసాగిస్తూనే, మరోవైపు దర్శకత్వ పరమైన బాధ్యతలను నిర్వహించడం ఆయనకు ఎదురైన ప్రత్యేకమైన అనుభవంగా చెప్పుకోవచ్చు.
బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా..
డి. రామానాయుడు నిర్మించిన బెండు అప్పారావు RMP సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ, ఎమోషన్స్, తో ఈమూవీ కథ, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లరి నరేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే.. ఆడియన్స్ కదలకుండా చూస్తుంటారు.
నటనకు మించి నిరూపించుకున్న ప్రతిభ
సాధారణంగా ఒక సినిమాలో హీరోగా నటించడం ఒక బాధ్యత అయితే, అదే సినిమాకు దర్శకత్వ పరమైన బాధ్యతలు నిర్వర్తించడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా షూటింగ్ చివరి దశలో ఇలాంటి బాధ్యతలు చేపట్టడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో నరేష్ ముందుకొచ్చి సినిమా పూర్తయ్యేలా సహకరించడం ఆయనలోని బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.









