MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే

Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీ గురించి పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో ఎక్కువ క్రెడిట్ తనదే అని అన్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Posani Krishna Murali
Image Credit : Asianet News

Posani Krishna Murali

రచయిత, దర్శకుడు, నటుడు పోసాని గురించి పరిచయం అవసరం లేదు. రచయితగా అద్భుతమైన చిత్రాలకు కథలు, మాటలు అందించారు. దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఇక నటుడిగా మొన్నటి వరకు ఫుల్ బిజీగా గడిపారు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో రాజకీయపరమైన వివాదాలు పోసానిని చిక్కుల్లో పడేశాయి. ఆ తర్వాత పోసానికి అవకాశాలు కాస్త తగ్గాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోసాని శిష్యులు
Image Credit : Asianet News

పోసాని శిష్యులు

త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను లాంటి అగ్ర దర్శకులు పోసాని శిష్యులే. త్రివిక్రమ్, కొరటాల సినిమాల్లో కూడా పోసాని నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటించారు.

35
నాలుగు రోజుల పాత్రతో ఫుల్ క్రెడిట్
Image Credit : facebook/@trivikramsrinivas

నాలుగు రోజుల పాత్రతో ఫుల్ క్రెడిట్

పోసాని కామెడీ విలన్ గా చిన్న పాత్రలో మెరిశారు. పోసాని మాట్లాడుతూ.. త్రివిక్రమ్ నా దగ్గర నాలుగేళ్లు శిష్యుడిగా పనిచేశాడు. అత్తారింటికి దారేది మూవీలో కేవలం 4 రోజుల పాత్ర ఇచ్చాడు. ఏంటయ్యా త్రివిక్రమ్, నా దగ్గర 4 ఏళ్ళు శిష్యరికం చేసి 4 రోజుల పాత్ర మాత్రమే ఇస్తావా అని అడిగా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్ర ఇంపాక్ట్ చాలా బలంగా కనిపించింది. హీరో హీరోయిన్ల తర్వాత నా పాత్రకే బాగా పేరొచ్చింది. త్రివిక్రమ్ అంటే ఏంటో అప్పుడు నాకు అర్థం అయింది అని పోసాని అన్నారు.

45
మాటల్లోనుంచి కథ వస్తుంది
Image Credit : Social Media

మాటల్లోనుంచి కథ వస్తుంది

అందరూ కథ రాసి మాటలు రాస్తారు. కానీ త్రివిక్రమ్ మాటల్లోనుంచే కథ పుడుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప దర్శకుడు, రచయిత మాత్రమే కాదు. గొప్ప వ్యక్తి కూడా. నా దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు అంటూ పోసాని ప్రశంసలు కురిపించారు.

55
త్రివిక్రమ్ సినిమాలు
Image Credit : Asianet News

త్రివిక్రమ్ సినిమాలు

నా దగ్గర శిష్యులుగా పనిచేసిన వారిలో త్రివిక్రమ్ ది బెస్ట్ అని పోసాని ప్రశంసలు కురిపించారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, అత్తారింటికి దారేది, అ..ఆ లాంటి సినిమాల్లో పోసాని నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasarao: తెలుగు నటుడిగా సిగ్గుపడుతున్నా.. డైరెక్టర్లపై కోట శ్రీనివాసరావు సంచలన కామెంట్స్, కారణం ఏంటి?
Recommended image2
OTT: ఆ నర్సు గొంతు కోసం ఆరాటపడే హీరో, దిమ్మతిరిగే ట్విస్టులు.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
Recommended image3
Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?
Related Stories
Recommended image1
OTT: ఆ నర్సు గొంతు కోసం ఆరాటపడే హీరో, దిమ్మతిరిగే ట్విస్టులు.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
Recommended image2
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved