MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ

Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత తొలి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2026, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రీసెంట్ గా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. దీనితో హౌస్ లో కొత్త జోష్ వచ్చింది అని అంతా భావిస్తున్నారు. వైల్డ్ కార్డు సభ్యులు వచ్చాక హౌస్ లో తొలి నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. నామినేషన్స్ లో వైల్డ్ కార్డు సభ్యులకు బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చారు. కెప్టెన్ తో పాటు వైల్డ్ కార్డు సభ్యులని క్కూడా నామినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నామినేషన్స్ ప్రక్రియ
Image Credit : Asianet News

నామినేషన్స్ ప్రక్రియ

నామినేషన్స్ చేసే అవకాశం పొందేందుకు ముందుగా గేమ్ లో విజయం సాధించాలి. ఆ గేమ్ లో పాల్గొనే ఇద్దరేసి సభ్యులని వైల్డ్ కార్డు సభ్యులు ఎంచుకుంటారు. గేమ్ లో విజయం సాధించిన వారికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ ఇన్వాలిడ్ అని అనిపిస్తుందో వాళ్ళని వైల్డ్ కార్డు సభ్యుడు సేవ్ చేయొచ్చు. వాలీడ్ నామినేషన్ అనిపించిన వాళ్ళు నామినేట్ అవుతారు.

35
టీ కప్పులే కడగలేవు
Image Credit : Asianet News

టీ కప్పులే కడగలేవు

ముందుగా గేమ్ ఆడదానికి వైల్డ్ కార్డు సభ్యుడు శివకుమర్.. త్రిగుణ్, రోహిత్ లని ఎంచుకున్నాడు. గేమ్ లో రోహిత్ విజయం సాధించి నామినేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. రోహిత్ ముందుగా వంశీని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ చాలా బలంగా సాగింది. వాళ్ళ ఆర్గుమెంట్ లో భాగంగా నేను బిగ్ బాస్ కప్పుతో వెళతాను నువ్వు ఇక్కడే ఉండు హౌస్ లో ఒంటరిగా అని రోహిత్ అన్నాడు. వంశీ కౌంటర్ ఇస్తూ నువ్వు టీ కప్పులే కడగలేవు.. ఇక బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్ అంటూ పరువు తీశాడు.

45
ఝాన్సీని సేవ్ చేసిన శివ కుమార్
Image Credit : Asianet News

ఝాన్సీని సేవ్ చేసిన శివ కుమార్

ఆ తర్వాత రోహిత్ ఝాన్సీని నామినేట్ చేశాడు. పల్లెటూరి సెంటిమెంట్, జనాల సెంటిమెంట్ వాడుతున్నారు. అదే విధంగా ఎలిమినేట్ అవుతారు అనే భయంతో మ్యాజికల్ పవర్ వాడారు. అంటే మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అనే భయం మీలో ఉంది అని రోహిత్ ఆమెని నామినేట్ చేశాడు. దీనికి ఝాన్సీ సమాధానం ఇస్తూ నేను వచ్చిందే పల్లెటూరి నుంచి. అది చెప్పుకోవడంలో తప్పు లేదు. మ్యాజికల్ పవర్ అనేది బిగ్ బాస్ నాకు ఇచ్చిన హక్కు అని ఝాన్సీ కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు నామినేషన్స్ లో ఝాన్సీ నామినేషన్ తనకు ఇన్వాలిడ్ అని అనిపించింది అని శివ కుమార్ తెలిపారు. తాను ఎక్కడ నుంచి వచ్చాను అనేది ఝాన్సీ చెప్పుకోవచ్చు. అదే విధంగా బిగ్ బాస్ ద్వారా ఆమెకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆమెని తాను సేవ్ చేస్తున్నాను అని శివకుమార్ తెలిపారు.

55
ముఖేష్, అమన్ గొడవ
Image Credit : Asianet News

ముఖేష్, అమన్ గొడవ

ఆ తర్వాత ముకేశ్.. అమన్, షాలిని లని నామినేట్ చేశారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ శ్వేతా నాయుడు షాలిని సేవ్ చేసింది. ముకేశ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరి గొడవలు ముకేశ్ కూడా ఇన్వాల్వ్ అయి అమన్ తో గొడవ పెట్టుకున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Recommended image2
OTT: ఆ నర్సు గొంతు కోసం ఆరాటపడే హీరో, దిమ్మతిరిగే ట్విస్టులు.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved