దేవర, కల్కి, సలార్ చిత్రాలపై విషం కక్కారు.. 3 గంటల పాటు కర్ణుడినే చూపించాలా?
స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రోజు రోజుకి నెగిటివిటీ ఎక్కువైపోతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తరచుగా స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాం.
స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రోజు రోజుకి నెగిటివిటీ ఎక్కువైపోతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తరచుగా స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాం. దీనిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సలార్, కల్కి, దేవర చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇకపై స్టార్ హీరోల చిత్రాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం కష్టం అని నాగవంశీ పేర్కొన్నారు. దానికి కారణం అభిమానులే. విపరీతంగా నెగిటివిటి ఎక్కువైపోయింది. షోకి ముందే నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక హీరో సినిమాపై మరో హీరో అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
దీనికి తోడు రివ్యూలు ఇచ్చేవాళ్ళు కావాలనే లేని తప్పులని ఉన్నట్లు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో రివ్యూలు దారుణంగా ఉంటున్నాయి. సినిమా గురించి నెగిటివ్ గా చెప్పకపోతే వ్యూస్ ఉండడం లేదు. అందుకే కావాలనే తప్పులు మాత్రమే చెబుతూ బావున్న అంశాలని పక్కన పెట్టేస్తున్నారు.
అందుకు ఉదాహరణ సలార్, దేవర, కల్కి చిత్రాలే అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం చిత్రం కూడా అంతే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ తీసుకోండి.. ప్రశాంత్ నీల్ మూవీ ఎలా ఉంటుందో మనకు తెలియదా.. ఎలివేషన్ సీన్లు బాగా తీస్తారాయన. సలార్ లో అవి బావున్నాయి కదా.. అయినా నెగిటివిటి స్ప్రెడ్ చేశారు. తప్పులు వెతికారు. కల్కి చిత్రంపై కూడా విషం కక్కారు. ఫస్ట్ హాఫ్ ఏమి బాగా లేదు అంటూ ట్రోల్ చేశారు. అంటే సెకండ్ హాఫ్ లో చూపించిన కర్ణుడిని సినిమా మొత్తం 3 గంటల పాటు చూపించాలనేదా వాళ్ళ ఉద్దేశం అని నాగ వంశీ ప్రశ్నించారు.
ఇక దేవర విషయానికి వస్తే సెకండ్ పార్ట్ కోసం కొన్ని కీలక అంశాలని కొరటాల శివ దాచుకున్నారు. దానికి తగ్గట్లుగా ఫస్ట్ పార్ట్ వచ్చింది. సినిమా ఎంటర్టైనింగ్ ఉందా లేదా అని నాగవంశీ ప్రశ్నించారు. గుంటూరు కారం చిత్రానికి 1 గంట షోలు వేయడం వల్ల నెగిటివిటి వచ్చింది అని నాగవంశీ తెలిపారు.