విధి విచిత్రం అంటే ఇదే.. అన్నా చెల్లెళ్లుగా నటించారు, అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు.. వాళ్ళు పెద్ద స్టార్లు
సినిమా రంగంలో జరిగే ప్రతి విషయం అభిమానులకు తెలుస్తుంది. దీనితో కొన్ని అంశాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఆర్టిస్టులు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే కొన్ని పాత్రలు మాత్రం ఆడియన్స్ లో బాగా చర్చనీయాంశం అవుతాయి.
సినిమా రంగంలో జరిగే ప్రతి విషయం అభిమానులకు తెలుస్తుంది. దీనితో కొన్ని అంశాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఆర్టిస్టులు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే కొన్ని పాత్రలు మాత్రం ఆడియన్స్ లో బాగా చర్చనీయాంశం అవుతాయి. వెండితెరపై జంటగా నటించి రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన జంటలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నాగార్జున,అమల.. మహేష్ బాబు, నమ్రత లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు.
అయితే వెండితెరపై అన్నా చెల్లెళ్లుగా నటించి రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. వాళ్లిద్దరూ సాధారణ నటీనటులు కారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్స్ అని చెప్పొచ్చు. ఆ జంట ఎవరో కాదు.. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల.
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ప్రేమ వివాహం చేసుకున్నారు అనే సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండవ వివాహం. కృష్ణ, విజయ నిర్మల కలసి దాదాపు 50 చిత్రాల్లో నటించారు. రెండు చిత్రాల్లో అన్నా చెల్లెళ్లుగా నటించారు. 1961కృష్ణ ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విజయనిర్మలతో పరిచయం ఏర్పడడం ప్రేమగా మారడం జరిగింది. అప్పటికే విజయనిర్మలకి కూడా పెళ్లి అయింది.
అయితే ఆమె కృష్ణ ప్రేమ కోసం తన భర్తకి విడాకులు ఇచ్చింది. దీనితో వీళ్ళిద్దరూ 1969 లో తిరుమలలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కృష్ణ వైపు నుంచి ఈ పెళ్ళికి కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదు. 1967 లో కృష్ణ, విజయ నిర్మల మంచి మిత్రులు అనే చిత్రంలో అన్నా చెల్లెళ్లుగా నటించారు. ఆ తర్వాత ముహూర్త బలం చిత్రంలో 1969లో మరోసారి అన్నా చెల్లెళ్లుగా నటించారు. అదే ఏడాది వీళ్లిద్దరి రియల్ లైఫ్ లో భార్య భర్తలు అయ్యారు.
Also Read : బిగ్ బాస్ లో ఈవారం నామినేషన్స్ లిస్ట్ ?..డేంజర్ జోన్ లో ఉన్నది అతడే..
కృష్ణ, విజయనిర్మల వివాహం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయింది. సీనియర్ నటుడు చంద్రమోహన్ వీళ్లిద్దరి పెళ్ళికి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. కృష్ణ విజయనిర్మలతో పాటు చంద్రమోహన్ తిరుమలకి వెళ్లి వీళ్ళ పెళ్లి జరిపించారు.