- Home
- Entertainment
- విషాదంలో ఉన్న అలీని నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత, వార్నింగ్ ఇచ్చి షూటింగ్ ఆపేసిన రాఘవేంద్రరావు
విషాదంలో ఉన్న అలీని నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత, వార్నింగ్ ఇచ్చి షూటింగ్ ఆపేసిన రాఘవేంద్రరావు
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలీ చురుకుదనం కామెడీ టైమింగ్ చూసి దర్శక నిర్మాతలు చాలా చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. పెద్దయ్యాక అలీ టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా, హీరోగా కూడా ఎదిగిన సంగతి తెలిసిందే.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో..
ఓ ఇంటర్వ్యూలో అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన చాలా చిత్రాల్లో అలీ నటించారు. 1980లో రాఘవేంద్రరావు దర్శకుడిగా మురళీమోహన్ తో 'నిప్పులాంటి నిజం' అనే చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అప్పట్లో తెలుగు సినిమాలు కూడా చెన్నైలో షూటింగ్ జరుపుకునేవి.
అలీ ఇంట్లో విషాదం
అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి. నిప్పులాంటి నిజం షూటింగ్ కోసం అలీ రాజమండ్రి నుంచి చెన్నైకి వెళ్ళాలి. కానీ అప్పట్లో ఆంధ్రాలో పెద్ద తుఫాను వచ్చింది. పైగా అదే సమయంలో అలీ మూడవ సోదరి మరణించారట. అలీ మాట్లాడుతూ మా చెల్లి చనిపోయింది.. ఆ టైంలో తుఫాను కూడా ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కి వెళ్ళలేకపోయాను. మరుసటి రోజు ఎలాగోలా చెన్నైకి వెళ్లి షూటింగ్ కి హాజరయ్యాను. ఆ చిత్ర నిర్మాత నన్ను పిలిచి షూటింగ్ కి ఎందుకు రాలేదని కొట్టారు.
నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత
ఇంతమంది ఆర్టిస్టులు షూటింగ్ కి వస్తే నీకు రావడానికి ఏం.. అంటూ గట్టిగా అరుస్తూ నన్ను కొట్టారు. నేను బాధపడుతూ పక్కన కూర్చుండి పోయాను. రాఘవేంద్ర రావు గారు అప్పుడే కారు దిగి నన్ను చూశారు. ఏరా ఎందుకలా ఉన్నావ్ ఏం జరిగింది అని అడిగారు. దీనితో నేను నిర్మాత కొట్టారు అని చెప్పాను.
షూటింగ్ ఆపేసిన రాఘవేంద్ర రావు
రాఘవేంద్ర రావు గారు నిర్మాతను పిలిచి వీడిని ఎందుకు కొట్టారు అని అడిగారు. షూటింగ్ కి రాలేదు కదా అని నిర్మాత సమాధానం ఇచ్చారు. షూటింగ్ కి రాకపోతే కొడతారా? వాడు చిన్న పిల్లాడు కారణం తెలుసుకోకుండా అలా కొట్టడం ఏంటి.. వాడి చెల్లి చనిపోయింది తెలుసా అందుకే షూటింగ్ కి రాలేదు. నిజం తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించవద్దు అని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చి ఆరోజు షూటింగ్ ను రాఘవేంద్రరావు గారు క్యాన్సిల్ చేసేశారు అని అలీ తెలిపారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆలీని చూస్తే నాకు శ్రీదేవి గుర్తొస్తుంది. ఎందుకంటే అలీ కూడా ఆమెలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నా కళ్ళముందే పెరిగాడు. అలీ కూడా శ్రీదేవి తరహాలో బాలీవుడ్ కి వెళ్లి రాణించాలని కోరుకుంటున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు.