- Home
- Entertainment
- హరికృష్ణ చెప్పకపోతే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ ఉండేది కాదా ? ఆ మూవీ ఫ్లాప్ అని ముందే తెలుసు
హరికృష్ణ చెప్పకపోతే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ ఉండేది కాదా ? ఆ మూవీ ఫ్లాప్ అని ముందే తెలుసు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. రామోజీరావు నిర్మాణంలో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nandamuri Harikrishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వార్ 2 చిత్రం రాబోతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Jr NTR, Nandamuri Harikrishna
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గురించి స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. రామోజీరావు నిర్మాణంలో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంపై నందమూరి హరికృష్ణ కి ముందు నుంచి అనుమానంగానే ఉండేదట.
ఈ చిత్రం సాధించదని హరికృష్ణ ముందే అంచనా వేశారు. దీంతో ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ సెట్ చేయాలని ప్రొడ్యూసర్ అశ్విని దత్ దగ్గరికి వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ తో రామోజీరావు గారు ఒక సినిమా నిర్మిస్తున్నారు. దానిపై నాకు అంతగా నమ్మకం లేదు. త్వరలో ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ తో మీరు ఒక మంచి సినిమా నిర్మించాలి అని హరికృష్ణ అశ్విని దత్ ని రిక్వెస్ట్ చేశారట. నేను సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ల ఫ్యామిలీలో ఒకడిగా మారిపోయాను.
హరికృష్ణ మాకు బాగా క్లోజ్. అలాంటి హరికృష్ణ అడిగినప్పుడు చేయకుండా ఎందుకు ఉంటాను. తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని మాట ఇచ్చాను. ఆ విధంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 అనే చిత్రం అనుకున్నాం. అనుకోకుండా ఆ చిత్రానికి రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళిని దర్శకుడుగా పెట్టాం. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ కి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సూపర్ హిట్ దక్కింది అని అశ్వినీ దత్ అన్నారు.
స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ లో టాప్ స్టార్ డమ్ కి చేరుకున్నారని అశ్వినీ దత్ అన్నారు. ఆ తర్వాత అశ్విని దత్ ఎన్టీఆర్ కాంబినేషన్లో శక్తి చిత్రం వచ్చింది. ఆ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.