MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyanka Chopra: భారీ బయోపిక్‌లో ప్రియాంక చోప్రా.. సెలైంట్‌గా దూసుకుపోతున్న గ్లోబల్‌ బ్యూటీ

Priyanka Chopra: భారీ బయోపిక్‌లో ప్రియాంక చోప్రా.. సెలైంట్‌గా దూసుకుపోతున్న గ్లోబల్‌ బ్యూటీ

Priyanka Chopra: `వారణాసి` మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 28 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
'అమ్రి' ప్రాజెక్ట్‌లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ
Image Credit : Instagram

'అమ్రి' ప్రాజెక్ట్‌లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియా మూవీ చేస్తోంది. అదే `వారణాసి`. ఇదే మూవీతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మరో వైపు  తన బిజీ షెడ్యూల్‌లో మరో పెద్ద ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. ఫిల్మ్‌మేకర్ మీరా నాయర్ ఎంతో  ప్రస్టీజియస్‌గా తీస్తున్న 'అమ్రి' సినిమాలో ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
'అమ్రి'లో ప్రియాంకది గెస్ట్ రోల్ కాదు, పవర్‌ఫుల్ రోల్!
Image Credit : Instagram

'అమ్రి'లో ప్రియాంకది గెస్ట్ రోల్ కాదు, పవర్‌ఫుల్ రోల్!

రిపోర్ట్స్ ప్రకారం, 'అమ్రి'లో ప్రియాంక చోప్రా పాత్ర నిడివి తక్కువే అయినా కథలో చాలా కీలకం. 'ఈ సినిమా పెయింటర్ జీవితాన్ని హంగరీ, ఇండియా, ఫ్రాన్స్‌లలో చూపిస్తుంది. ఈ ప్రత్యేక పాత్ర కోసం మీరా గత ఏడాది ప్రియాంకను సంప్రదించారు. ఆమె ఇటీవల దీని షూటింగ్ పూర్తి చేసింది' అని మిడ్-డే రిపోర్ట్ పేర్కొంది.

Related Articles

Related image1
OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే
Related image2
Ashu Reddy Controversy: ఆషు రెడ్డి 9.83కోట్ల వివాదం, రంగంలోకి వేణుస్వామి, టీవీ నటి.. ఆడియో లీక్‌ దుమారం
36
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్
Image Credit : Instagram

హైదరాబాద్ నుంచి అమృత్‌సర్

ప్రియాంక చోప్రా తన బిజీ షెడ్యూల్‌లో కూడా 'అమ్రి' కోసం సమయం కేటాయించింది. ఆమె మొదట 'వారణాసి' షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంది. అక్కడి నుంచి నేరుగా అమృత్‌సర్ వెళ్లి రెండు రోజుల్లో 'అమ్రి'లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసింది.
46
అసలు 'అమ్రి' కథ ఏంటి?
Image Credit : Instagram

అసలు 'అమ్రి' కథ ఏంటి?

ఈ సినిమా ప్రముఖ పెయింటర్ అమృతా షేర్-గిల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆమె కథ హంగరీ, ఫ్రాన్స్, భారతదేశం చుట్టూ తిరుగుతుంది. ఫారెన్‌ ఆర్ట్ కి, భారతీయ ఇతివృత్తాలను కలిపి ఆమె ఒక కొత్త గుర్తింపు తెచ్చుకుంది. మోడ్రన్‌ భారతీయ కళకు కొత్త దిశ చూపింది.

56
అమృతా షేర్-గిల్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు?
Image Credit : Instagram

అమృతా షేర్-గిల్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాన్యా మానిక్తలా ఈ పాత్రలో కనిపించవచ్చని సమాచారం. ఇదే నిజమైతే, మీరా నాయర్‌తో ఆమెకు ఇది రెండో ప్రాజెక్ట్ అవుతుంది.
66
ప్రియాంక రాబోయే భారీ సినిమా
Image Credit : Instagram

ప్రియాంక రాబోయే భారీ సినిమా

'అమ్రి'తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్న 'వారణాసి' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.  పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మహేష్‌కి జోడీగా చేస్తుంది. ఇటీవలే వీరిద్దరిపై ఓ పాటని కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Related Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే
Recommended image2
Ashu Reddy Controversy: ఆషు రెడ్డి 9.83కోట్ల వివాదం, రంగంలోకి వేణుస్వామి, టీవీ నటి.. ఆడియో లీక్‌ దుమారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved