MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Ashu Reddy Controversy: ఆషు రెడ్డి 9.83కోట్ల వివాదం, రంగంలోకి వేణుస్వామి, టీవీ నటి.. ఆడియో లీక్‌ దుమారం

Ashu Reddy Controversy: ఆషు రెడ్డి 9.83కోట్ల వివాదం, రంగంలోకి వేణుస్వామి, టీవీ నటి.. ఆడియో లీక్‌ దుమారం

Ashu Reddy Controversy: బిగ్‌ బాస్‌ ఫేమ్‌, నటి ఆషురెడ్డి వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఆమె హైకోర్ట్ ని ఆశ్రయించింది. మరోవైపు ఆషురెడ్డి సెటిల్మెంట్‌ ఆడియో లీక్‌ అయ్యింది. ఇందులో వేణు స్వామి ప్రస్తావన తీసుకొచ్చింది ఆషు రెడ్డి.

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 28 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధర్మేంద్రతో ఆషు రెడ్డి పెళ్లి
Image Credit : instagram/@ashu_uuu

ధర్మేంద్రతో ఆషు రెడ్డి పెళ్లి

బిగ్ బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది. ఆమె పెళ్లి పేరుతో 9.83కోట్లు మోసం చేసినట్టు ఎన్‌ఆర్‌ఐ ధర్మేంద్ర ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ధర్మేంద్ర తెలిపిన వివరాలు ప్రకారం 2018లో అషు రెడ్డితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహం వరకు దారితీసింది. ఇరు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చలు జరపడమే కాకుండా, జాతకాలు కూడా చూయించుకున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆమెను పూర్తిగా నమ్మిన ధర్మేంద్ర నుండి వివిధ సందర్భాల్లో ఆమె భారీగా నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధర్మేంద్రని మోసం చేసిన ఆషు రెడ్డి?
Image Credit : instagram/@ashu_uuu

ధర్మేంద్రని మోసం చేసిన ఆషు రెడ్డి?

ధర్మేంద్ర నుండి సుమారు రూ. 9.35 కోట్లకు పైగా అషు రెడ్డి వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఆమె తన వ్యక్తిగత అవసరాల కోసం, తన సోదరి పేరు మీద మరో యాభై లక్షలు తీసుకున్నట్లు అతను ఆరోపిస్తున్నాడు. తీసుకున్న డబ్బుతో ఆమె బంగారం, ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వివరాలు కూడా బయటకు వస్తుండటంతో కేసు తీవ్రత పెరుగుతోంది. పెళ్ళి చేసుకో, లేదంటే డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే, తనపై తప్పుడు కేసులు పెడతానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించినట్లు ధర్మేంద్ర ఆరోపించారు. ఈ కుట్రలో ఆమె ప్రస్తుత స్నేహితుడు జయంత్ పాత్ర కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Related image1
OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే
Related image2
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
35
హైకోర్ట్ ని ఆశ్రయించిన ఆషు రెడ్డి
Image Credit : instagram/@ashu_uuu

హైకోర్ట్ ని ఆశ్రయించిన ఆషు రెడ్డి

ధర్మేంద్ర ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు మోసం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తన వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని ఆమె పేర్కొన్నారు. కేవలం తనను బ్యాడ్‌ చేయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే పోలీసుల దృష్టికి వెళ్లినా, ఇప్పుడు వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. అషు రెడ్డి కెరీర్‌పై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది వేచి చూడాలి. హైకోర్టు విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.

45
ఆషు రెడ్డి ఆడియో లీక్‌..రంగంలోకి వేణుస్వామి
Image Credit : instagram/@ashu_uuu

ఆషు రెడ్డి ఆడియో లీక్‌..రంగంలోకి వేణుస్వామి

ఇదిలా ఉంటే ఆషురెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆడియో లీక్‌ అయ్యింది. ధర్మేంద్రతో రాయబారానికి వచ్చింది ఆషు రెడ్డి. కోటిన్నర సెటిల్మెంట్‌ చేస్తానని చెబుతోంది. ఈ మేరకు ఆమె ధర్మేంద్రకి ఆడియోని పంపించింది. ఈ ఆడియో బయటకు వచ్చింది. ఇందులో ఆమె తనకు మే నెల వరకు టైమ్‌ ఇస్తే కోటిన్నర సెటిల్‌ చేస్తానని చెప్పింది. దీనికోసం వేణు స్వామి, ప్రవీణ అక్క పెద్దమనుషులుగా వస్తారని, అందరం కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామని అషురెడ్డి ఇందులో చెప్పింది. ప్రస్తుతానికి మే నెలే తనకు టార్గెట్‌గా కనిపిస్తోందని, మిగిలిన డబ్బును ఆమె తన లైఫ్‌లో సెటిల్‌ అయ్యాకి తిరిగి ఇస్తానని చెబుతోంది. ఈ వివాదంలోకి తన తల్లిని, చెల్లిని లాగొద్దని, ఏదైనా తనతోనే మాట్లాడాలని చెప్పింది.

55
ధర్మేంద్రపై ఆషు రెడ్డి రివర్స్ ఎటాక్‌
Image Credit : instagram/@ashu_uuu

ధర్మేంద్రపై ఆషు రెడ్డి రివర్స్ ఎటాక్‌

ఈ సెటిల్మెంట్‌కి సిద్ధమైతే ఓకే, లేదంటే రివర్స్ కేసు పెడతానని, తనని, తన చెల్లిని, అమ్మని ఇందులోకి లాగుతున్నావని, వారిని హెరాస్‌ చేస్తున్నావని రివర్స్ లో కేసు పెడతానని బెదిరింపులకు దిగింది. తన ముఖం చూడాలని తాను అనుకోవడం లేదని, ఈ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలని తాను అనుకోవడం లేదని తెలిపింది ఆషురెడ్డి. ఆమె పేరుతో లీక్‌ అయిన ఈ ఆడియోలో ఉన్నది ఆమె వాయిసేనా, ఇది ఒరిజినల్‌ వాయిసేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆడియో లీక్‌ కావడంతో బాధితుడు ధర్మేంద్ర రియాక్ట్ అయ్యాడు. తన నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు కేవలం ఒక కోటిన్నర రూపాయలతో సెటిల్ చేస్తాననడం మోసమని, డబ్బు అడిగితే రివర్స్ కేసు పెడతానని బెదిరించడం అన్యాయమని పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Recommended image2
Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Recommended image3
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Related Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే
Recommended image2
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved