MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే

OTT Movies: ప్రైమ్‌ లో దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఐదు తెలుగువే

OTT Movies: ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. థియేటర్లో ఆడని సినిమాలన్నీ ఓటీటీలో బాగా ఆడుతున్నాయి. ప్రైమ్‌ వీడియోలో టాప్‌ 10లో ఐదు తెలుగు సినిమాలు ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 28 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ప్రైమ్‌ టాప్‌ 10 మూవీస్‌
Image Credit : Asianet News

ప్రైమ్‌ టాప్‌ 10 మూవీస్‌

థియేటర్‌లో సినిమాల కాలం తగ్గిపోతుంది. అదంతా ఇప్పుడు ఓటీటీలు ఆక్రమిస్తున్నాయి. ఓటీటీలో సినిమాలు ఎక్కువ రోజులు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇకపై ఓటీటీలో ఎక్కువ రోజులు టాప్‌లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకునే పరిస్థితి రాబోతుంది. ఇందులో విచిత్రం ఏంటంటే థియేటర్లో ఆడని సినిమాలు ఓటీటీలో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 మూవీస్‌ చూస్తే, అందులో ఐదు సినిమాలు తెలుగువే ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
మొదటి స్థానంలో హ్యాపీ రాజ్‌
Image Credit : X/@gvprakash

మొదటి స్థానంలో హ్యాపీ రాజ్‌

ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న చిత్రాల్లో మొదటి స్థానంలో తమిళ సినిమా `హ్యాపీ రాజ్‌` ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ఇది. మారియా రాజా దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా నటించింది. అబ్బాస్‌ రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడలేదు. యావరేజ్‌ టాక్‌ వచ్చినా వసూళ్ల పరంగా వెనకబడింది. కానీ ఈ వారం ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

Related Articles

Related image1
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
Related image2
Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం
38
టాప్‌ 2 లో బాలీవుడ్‌ మూవీ
Image Credit : Asianet News

టాప్‌ 2 లో బాలీవుడ్‌ మూవీ

ప్రైమ్‌లో టాప్‌ 2లో ట్రెండ్‌ అవుతున్న చిత్రం `ఓ రోమియో`. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ హీరో. డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటించగా, తమన్నా, నానా పటేకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో మాత్రం ట్రెండ్‌ అవుతుంది. రెండు వారాలుగా ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతుండటం విశేషం. మూడో స్థానంలో కన్నడ సినిమా `సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌`  ట్రెండ్‌ అవుతుంది. దీన్ని తెగ చూస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. నాల్గో స్థానంలో హాలీవుడ్‌ చిత్రం `క్రైమ్‌ 101` ట్రెండ్‌ అవుతుంది.

48
ప్రైమ్‌లో తెలుగు మూవీ `మేన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌` ట్రెండింగ్‌
Image Credit : Asianet News

ప్రైమ్‌లో తెలుగు మూవీ `మేన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌` ట్రెండింగ్‌

ఐదో స్థానంలో తెలుగు సినిమా `మేన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌` ఉంది. శ్రీనాథ్‌ మాగంటి హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ సినిమా ఇది. గాయత్రి రమణ హీరోయిన్‌గా నటించగా, కామాక్షి భాస్కర్ల, కసిరెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, సాయి ప్రసన్న ముఖ్య పాత్రలు పోషించారు. మార్చిలో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ కావడం విశేషం.

58
ప్రియదర్శి సుయోధన రచ్చ
Image Credit : prime video

ప్రియదర్శి సుయోధన రచ్చ

ప్రైమ్‌లో టాప్‌ 6లో ట్రెండ్‌ అవుతున్న మరో తెలుగు సినిమా `సుయోధన`. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలక పాత్ర పోషించారు. సైకలాజికల్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. ఆ మధ్యనే థియేటర్లోకి వచ్చింది. దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రైమ్‌లో టాప్‌ 10లో ఆరో స్థానంలో ట్రెండ్‌ కావడం విశేషం.

68
రెండు నెలలుగా సరస్వతి ట్రెండింగ్‌
Image Credit : X/@varusarath5

రెండు నెలలుగా సరస్వతి ట్రెండింగ్‌

ప్రైమ్‌లో టాప్‌ 7లో ట్రెండ్‌ అవుతున్న చిత్రం `సరస్వతి`. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి, ప్రధాన పాత్రలో నటిస్తూ రూపొందించిన చిత్రమిది. చిన్న పాపపై అఘాయిత్యం నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రియమణి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది థియేటర్లో ఏమాత్రం ఆదరణ పొందలేదు. కానీ ఓటీటీలో గత రెండు నెలలుగా ట్రెండ్‌ అవుతుంది. ఇండియా వైడ్‌గా దీన్ని తెగ చూస్తున్నారు. టాప్‌ 8లో మలయాళ మూవీ `ఉలత్తూశాంతే కల్లన్‌` ట్రెండ్‌ అవుతుంది.

78
లేచింది మహిళా లోకం మూవీ రచ్చ
Image Credit : Asianet News

లేచింది మహిళా లోకం మూవీ రచ్చ

టాప్‌ 9లో మరో తెలుగు మూవీ `లేచింది మహిళా లోకం` ఉంది. ఇది డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన సినిమా. ఇందులో మంచు లక్ష్మి, శ్రద్ధా దాస్‌, హేమ, అనన్య నాగళ్ల, హరితేజ, శ్రీరామ్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. దీనికి అర్జున్‌ గున్నల దర్శకత్వం వహించారు. చాలా వరకు మహిళా టెక్నీషియన్లు పనిచేశారు.

88
ఐదు నెలలుగా ఈషా మూవీ ట్రెండింగ్‌
Image Credit : Asianet News

ఐదు నెలలుగా ఈషా మూవీ ట్రెండింగ్‌

గతేడాది థియేటర్లోకి వచ్చిన `ఈషా` మూవీ కూడా ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో ట్రెండ్‌ అవుతుంది. హర్రర్‌ థ్రిల్లర్‌ డ్రామాగా ఇది రూపొందింది. ఇందులో త్రిగున్‌, అఖిల్‌ రాజ్‌, హేబా పటేల్‌, సిరి హన్మంతు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లో భయపెట్టిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. ఇండియా వైడ్‌గా గత నాలుగైదు నెలలుగా ట్రెండ్‌ కావడం విశేషం. ఇలా ఐదు తెలుగు సినిమాలు ప్రైమ్‌ టాప్‌ 10లో రచ్చ చేస్తూ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Related Stories
Recommended image1
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
Recommended image2
Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved