- Home
- Entertainment
- OTT: ప్రైమ్ వీడియోలో 'ఎ' సర్టిఫికెట్ సినిమాల డామినేషన్.. అర్జెంట్ గా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
OTT: ప్రైమ్ వీడియోలో 'ఎ' సర్టిఫికెట్ సినిమాల డామినేషన్.. అర్జెంట్ గా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
Prime Video Top 5 Movies: ప్రైమ్ వీడియోలో కొన్ని చిత్రాలు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 మూవీస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

OTT Movies
ఓటీటీలో తరచుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థల్లో అదిరిపోయే కంటెంట్, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే చిత్రాలు ఉంటాయి. ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం టాప్ లో ట్రెండింగ్ లో ఉన్న 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రెండింగ్ లో ఉన్న 5 సినిమాల్లో 3 చిత్రాలు ఎ సర్టిఫికెట్ సినిమాలే కావడం విశేషం. మంచి టైం పాస్ కావాలి అంటే ఈ 5 సినిమాలని వెంటనే చూడండి.
ఓ రోమియో
షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో నెంబర్ 1 గా ఉంది. ఈ చిత్రంలో ఉన్న యాక్షన్, రొమాన్స్ వల్ల సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.
క్రైమ్ 101
ఇది హాలీవుడ్ చిత్రం. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా ఎ సర్టిఫికెట్ చిత్రమే. అవెంజర్స్ చిత్రాల్లో థోర్ పాత్రలో అదరగొట్టిన క్రిస్ హామ్స్ వర్త్ ఈ చిత్రంలో హీరో. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లో 2వ స్థానంలో ఉంది.
ది బాయ్స్
ఆంటోని స్టార్ ప్రధాన పాత్రలో నటించిన ది బాయ్స్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ లో ఉంది. సూపర్ హీరో సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది కూడా ఎ రేటెడ్ సిరీస్ నే.
సీతా పయనం
సీనియర్ హీరో అర్జున్ దర్శక నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం సీతా పయనం. తన మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా, కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పెట్టి అర్జున్ ఈ చిత్రాన్ని రూపిందించారు. ఇది క్లీన్ యు సర్టిఫికెట్ మూవీ. ఫ్యామిలీతో కలసి చూడొచ్చు. ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది.
ఎస్. సరస్వతి
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎస్. సరస్వతి. స్కూల్ కి వెళ్లిన తన కూతురు కనిపించకపోవడం, ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ వింతగా బిహేవ్ చేయడం లాంటి అంశాలు ఈ చిత్రంలో ఆకట్టుకుంటాయి. ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఈ మూవీ టాప్ 5 గా ఉంది.

