MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి

CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి

దళపతి విజయ్‌ సీఎం అయిన నేపథ్యంలో అర్జున్‌ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావడానికి తన వద్ద డబ్బు లేదని, మనీ లేనిదే రాజకీయం లేదని తెలిపారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 25 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీఎంగా సంచలనం సృష్టించిన విజయ్‌
Image Credit : Asianet News

సీఎంగా సంచలనం సృష్టించిన విజయ్‌

దళపతి విజయ్‌.. తమిళనాడుకి సీఎం అయిన విషయం తెలిసిందే. తాను స్థాపించిన టీవీకే పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. ఇతర మిత్ర పక్షాల సపోర్ట్ తో సీఎం అయ్యారు. తమిళనాడులో సినిమా స్టార్స్ సీఎంలు కావడం కామనే. ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి వంటి వారు సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ వరుసలో విజయ్‌ కూడా సీఎం అయ్యారు. అయితే విజయ్‌ ఇంతటి భారీ మెజారిటీతో గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. సీఎం అవుతారని అస్సలు భావించలేదు, కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేసి ఆయన సంచలనం సృష్టించారు. చరిత్రని తిరగరాశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర్జున్‌ సినిమాపై విజయ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

అర్జున్‌ సినిమాపై విజయ్‌ కామెంట్‌

అయితే ప్రమాణస్వీకారం అనంతరం విజయ్‌ సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయనకు కలిగిన ఫీలింగ్‌ని బయటపెట్టాడు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో తన మనసులో మాటని పంచుకున్నారు. విజయ్‌ సీఎం అయ్యాక చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వెళ్లి అయన్ని అభినందించారు. ఈ క్రమంలో అర్జున్‌ కూడా వెళ్లి కళిశారు. ఆ సమయంలో ఈ సీఎం కుర్చీ ప్రస్తావన వచ్చింది. అర్జున్‌ని చూడగానే సర్‌ మీ సినిమానే యాడ్‌ చేసి మీమ్స్ చేస్తున్నారని తెలిపారు. ఆ సినిమానే `ఒకే ఒక్కడు`.

35
ఒకే ఒక్కడుసినిమాని గుర్తు చేసుకున్న విజయ్‌
Image Credit : Asianet News

ఒకే ఒక్కడుసినిమాని గుర్తు చేసుకున్న విజయ్‌

అర్జున్‌ హీరోగా శంకర్‌ ఈ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు జర్నలిస్ట్ గా ఉన్న అర్జున్‌.. సీఎంతో ఇంటర్వ్యూ చేయగా, సీఎం కుర్చీ ఎంత టెన్షన్‌, ఎంత ప్రెజర్‌గా ఉంటుందో తెలుసా? అని ఒక్క రోజు సీఎం అవుతాడు అర్జున్‌. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. పైన ఆ సినిమా క్లిప్‌లను పెట్టి కింద విజయ్‌ రియల్‌ గా సీఎం కుర్చీలో కూర్చుంటున్న వీడియోలు పెట్టి వైరల్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని విజయ్‌ కూడా చెప్పారట. ఈ కుర్చీ చూడగానే మీ సినిమానే గుర్తొచ్చిందని అన్నారట. విజయ్‌ సీఎం కావడం చాలా గర్వంగా ఉంది అన్నారు అర్జున్‌. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, మన మనిషి ఒకరు సీఎం కావడం గొప్ప విషయం, అది పెద్ద అఛీవ్‌మెంట్‌. పైగా మొదటిసారి పోటీ చేసిన వెంటనే సీఎం కావడం గొప్ప విషయం అన్నారు అర్జున్‌.

45
నా వద్ద డబ్బు లేదు
Image Credit : Asianet News

నా వద్ద డబ్బు లేదు

రాజకీయాలపై స్పందిస్తూ, తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. సేవ చేయాలని ఉందని, కానీ రాజకీయాల్లోకి రావాలని లేదని తెలిపింది. ఇప్పుడు రాజకీయాలు వేరు అని, డబ్బు మీదనే పని జరుగుతుందని, అంత డబ్బు తన వద్ద లేదని తెలిపారు. విజయ్‌ కూడా డబ్బు పెట్టకుండానే గెలిచారనే ప్రశ్నకి, ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఉందని, అంతటి ఫాలోయింగ్‌ ఇప్పుడు తనకు లేదు అని తెలిపారు అర్జున్‌. ప్రస్తుతం ఆయన `బ్లాస్ట్ జోన్‌` అనే చిత్రంలో నటించారు. ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుభాష్‌ కె రాజ్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తుంది. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

55
బ్లాస్ట్ సినిమాపై అర్జున్‌ కామెంట్‌
Image Credit : Asianet News

బ్లాస్ట్ సినిమాపై అర్జున్‌ కామెంట్‌

సినిమా గురించి అర్జున్‌ మాట్లాడుతూ, `బ్లాస్ట్ జోన్` సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. సినిమా పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి చెందే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమా 'బ్లాస్ట్ జోన్'. మన తల్లిదండ్రులకో, మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం కచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉంటాయి. నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశాను. కానీ, ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ నాకంటే బాగా ఫైట్లు చేశారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. రవి బస్రూర్ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మా సుభాష్ కె రాజ్ వయసులో చాలా చిన్నవాడు కానీ, గొప్పగా సినిమాను తెరకెక్కించాడు. ఇది విభిన్నమైన చిత్రం. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది` అని తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
టీవీకే విజయ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved