- Home
- Entertainment
- Karthika Deepam: నిరుపమ్‌పై సెటైర్లు వేసిన శౌర్య.. హిమ ప్రేమ కోసం ఆగని ప్రేమ్ ప్రయత్నాలు!
Karthika Deepam: నిరుపమ్‌పై సెటైర్లు వేసిన శౌర్య.. హిమ ప్రేమ కోసం ఆగని ప్రేమ్ ప్రయత్నాలు!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), సౌర్య ఒకే కారులో వెళుతూ ఒకరి గురించి ఎవరి తలుచుకొని మనసులో బాధపడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య(sourya)నేను ఎవరిని మోసం చేయలేదు అలాంటప్పుడు నేనెందుకు అదేర్యంగా ఉండాలి అని నిరుపమ్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. అప్పుడు వేరే వాళ్లకు కాల్ చేసినట్టుగా చేసి మన టైం బాగుంటే అన్ని బాగుంటాయి అని అంటుంది.
అప్పుడు నిరుపమ్(Nirupam)ఏం మాట్లాడుతుందో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సౌర్య ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు ఆటో డ్రైవర్స్ గా ఉన్న మనం కార్ ఓనర్ గా మారవచ్చు. కారు ఓనర్స్ గా ఉండేవారు డ్రైవర్లు కావచ్చు అని నిరుపమ్ ని ఉద్దేశించి అంటుంది. ఆ తర్వాత వారిద్దరూ కాసేపు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ సౌందర్య(soundarya)ఇంటికి చేరుతారు. అప్పుడు నిరుపమ్ సరే ప్రేమ్ వెళ్దాం పద అంటాడు.
అప్పుడు సౌర్య(sourya)ఒక్క నిమిషం డాక్టర్ సాబ్ అని అంటుంది. నిరుపమ్,దగ్గరికి వెళ్లిన సౌర్య,నిరుపమ్ ఇచ్చిన మొబైల్ ఫోన్ ను తిరిగి ఇచ్చేస్తుంది. ఆ తరువాత సౌందర్య, ఆనంద్ రావ్(anand rao)లు కార్తీక్,దీప లను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సౌందర్య వాళ్ళు బోనాల పండుగకు అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు.
అప్పుడు ప్రేమ్(pream) ఎలా అయినా సౌర్య,నిరుపమ్ లను కలపాలి అని శౌర్య,నిరుపమ్ ని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా హిమ,సౌర్యల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సౌందర్య(soundarya) కుటుంబం అందుకు సంతోషంగా కనిపిస్తారు.
అప్పుడు నిరుపమ్(Nirupam), నిలబడి నడుస్తూ ఉండగా ప్రేమ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఆ తరువాత పూజారి అమ్మవారి గొప్పతనం గురించి చెబుతాడు. ఆ తర్వాత ప్రేమ్ పూజారి చెప్పిన విధంగా చీటీలో పేరు రాసి కోరికను కోరుకొని హుండీలో ఆ పేపర్ ని వేయాలి అని అనుకుంటాడు. అప్పుడు హిమ(hima)కూడా సౌర్య కోసం చీటీ వేయాలి అనుకుంటుంది. ఆ తర్వాత సౌర్య రాసిన చీటీని చదివి హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.