- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: భార్య కోసం ఆటో నడపాలనుకుంటున్న ప్రేమ్.. తులసిపై పగ పెంచుకుంటున్న దివ్య!
Intinti Gruhalakshmi: భార్య కోసం ఆటో నడపాలనుకుంటున్న ప్రేమ్.. తులసిపై పగ పెంచుకుంటున్న దివ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెర ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ (Intinti Gruhalakshmi) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Intinti Gruhalakshmi
ప్రేమ్ (Prem) వాళ్ళ ఇంటిదగ్గర ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతూ ఉండటం తో శృతి ఆ గొడవను ఆపుతుంది. ఇక శృతి (Shruthi) ఏం జరిగింది అని అడగటంతో ఆవిడ తన బాధను చెప్పుకుంటూ.. తన భర్తతో తనకు కష్టాలు వస్తున్నాయి అని తెలుపుతుంది. ఇక ఆ మాటలు ప్రేమ్ కు గుచ్చుకోవడం తో ఆలోచనలో పడతాడు.
Intinti Gruhalakshmi
మరోవైపు అంకిత దివ్యతో (Divya) ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. దానికి దివ్య మొత్తం మమ్మీనే చేస్తుంది అని తను చాలా మారిపోయింది అంటూ ఫైర్ అవుతూ ఉంటుంది. కానీ అంకిత (Ankitha) మాత్రం ఆంటీది తప్పు లేదు అంటూ సరిదిద్దే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే అభి వచ్చి దివ్య (Divya) కు సపోర్ట్ గా మాట్లాడటంతో దివ్య తులసిపై మరింత కోపాన్ని ప్రదర్శిస్తోంది.
Intinti Gruhalakshmi
ప్రేమ్ (Prem) ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా రాములమ్మ జున్ను తీసుకొని వస్తుంది. కానీ ప్రేమ్ తీసుకోకుండా బాధ గా కనిపిస్తాడు. రాములమ్మతో తన బాధను చెప్పుకుంటాడు. ఆటో నడపాలి అనుకుంటున్నాను అని సహాయం చేయమని అంటాడు. అంతలోనే శృతి (Shruthi) వచ్చి ఏం జరిగింది అనటంతో తనకు నిజం చెప్పకుండా జున్ను టాపిక్ తీసి సరిదిద్దుతారు.
Intinti Gruhalakshmi
ఇక తులసి (Tulasi) ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉండటం తో వాళ్ళ అత్తయ్య వచ్చింది తులసికి ధైర్యం ఇస్తుంది. అంతా మంచే జరుగుతుంది అన్నట్లు సలహాలు ఇస్తుంది. కావాలంటే తప్పు చేస్తున్నా నందుని కూడా ఇంట్లో నుంచి పంపివ్వనా అనడంతో తులసి వద్దు అంటుంది. చీకటి పడటంతో ప్రేమ్ (Prem) పడుకుంటాడు.
Intinti Gruhalakshmi
పక్కన శృతి (Shruthi) లేకపోవడంతో లేచి చూస్తాడు. ఇక శృతి ప్రేమ్ బర్త్ డే సందర్భంగా క్యాండిల్స్ తో సర్ ప్రైజ్ ఇస్తుంది. చిన్న కేక్ కట్ చేసి నోట్లో పెడుతుంది. సరదాగా మాట్లాడుతూ ఉండగా.. ప్రేమ్ తన లాస్ట్ ఇయర్ బర్త్ డే ను గుర్తు చేసుకుంటూ ఆ మైకం లో కి వెళ్ళి పోతాడు. అక్కడ ప్రేమ్ (Prem) బర్త్ డే కోసం ఇంట్లో వాళ్లంతా డెకరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు.