- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అత్త నీడలో బ్రతుకుతూ డబ్బు కోసం దిగజారిపోయిన అభి.. ఛీ కొట్టిన అంకిత!
Intinti Gruhalakshmi: అత్త నీడలో బ్రతుకుతూ డబ్బు కోసం దిగజారిపోయిన అభి.. ఛీ కొట్టిన అంకిత!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఈ మార్పుకు కారణం ప్రవళిక (Pravalik) మావయ్య తను ఇచ్చిన ధైర్యంతోనే మారగలుగుతున్నాను అని తులసి చెబుతుంది. ఇక దివ్య కాలేజ్ కి వెళుతూ మామ్ రేపు ల్యాబ్ ఫీజ్ 20000 కట్టాలి మర్చిపోకు అని అంటుంది. మరోవైపు నందు (Nandu) తులసి అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక లాస్య (Lasya) వాకింగ్ లో తులసి కి ఎదురు పడినందుకు నందు పై విరుచుకు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పెళ్ళాం అయినా నా డ్రెస్ లు మీద కామెంట్స్ చేయకుండా.. తులసి (Tulasi) డ్రెస్ పై కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంది.
దివ్య (Divya) కు పెళ్లి చేసి పంపించే వరకు నేను తులసి గురించి పట్టించుకోని తీరుతాను అని నందు అంటాడు. దాంతో లాస్య మరింత కోపం వ్యక్తం చేస్తుంది. మరోవైపు అనసూయ తులసి (Tulasi) కి ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి అని చెబుతుంది. ఇక వచ్చే నెల నుండి ఇల్లు గడవడం కష్టం అవుతుంది అని తులసి ప్రవళిక తో అంటుంది.
ఇక ప్రవళిక (Pravalika) పార్కులో మీ ఆయనకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చావు మళ్లీ నీ జోలికి రాడు అని అంటుంది. అంతేకాకుండా పాటలు పాడడం లో తులసి (Tulasi) ప్రతిభను ప్రవళిక గుర్తు చేస్తుంది. మీ అమ్మ ని తలుచుకుని పాడడం మొదలు పెట్టు అని ప్రవళిక సలహా ఇస్తుంది.
ఆ తర్వాత తులసి (Tulasi) దగ్గర కు అంకిత వచ్చి ఈ ఇంటి కోడలిగా నేను బాధ్యత పంచుకుంటున్నాను అని కొంత డబ్బు చేతిలో పెడుతుంది. తులసి అంకితకు నచ్చ చెప్పి ఆ డబ్బు అంకిత హ్యాండ్ బాగ్ లో పెడుతుంది. మరోవైపు అభి (Abhi) కు వాళ్ళ అత్త కొంత డబ్బు ఇచ్చి ఉంచుకో ఖర్చులకు పనికొస్తాయని అంటుంది.
అది గమనించిన అంకిత (Ankitha) నువ్వు చాలా దిగజారి పోయావు అని అభి ను అనేక మాటలు అంటుంది. మరోవైపు లాస్య దంపతులు తన కొడుకుతో ఒక ఫంక్షన్ కి వస్తారు. అక్కడకు తులసి కూడా వస్తుంది. ఇక లాస్య కొడుకు తులసి (Tulasi) ని కౌగిలించుకుని ఆంటీ అంటే నాకు ఇష్టం అని అంటాడు. ఇక లాస్య తన కొడుకును కొట్టడానికి వెళుతుంది.