MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?

Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?

Pradeep Ranganathan: తమిళ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరో వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అయ్యాయి. వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఆ హీరో ఎవరో ఇక్కడ తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 12 2026, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిట్లు కొడుతున్న హీరో
Image Credit : Asianet News

హిట్లు కొడుతున్న హీరో

తమిళ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా ఓ యువ నటుడు వేగంగా ఎదుగుతున్నాడు. వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొదట డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా మారాడు. తన టాలెంట్‌తో మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోలీవుడ్ కొత్త కలెక్షన్ కింగ్
Image Credit : our own

కోలీవుడ్ కొత్త కలెక్షన్ కింగ్

2019లో ఓ హిట్‌ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. కొన్నేళ్లకే హీరోగా మారి బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టాడు. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో, 100 శాతం హిట్‌ రేట్‌తో దూసుకెళ్తున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, ప్రదీప్ రంగనాథన్.

35
డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్
Image Credit : mythri movie makers

డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్

గత దీపావళికి విడుదలైన 'డ్యూడ్' సినిమా భారీ హిట్‌గా నిలిచింది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రంలో ప్రదీప్ సరసన మమితా బైజూ నటించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

45
100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రదీప్ రంగనాథన్
Image Credit : X

100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రదీప్ రంగనాథన్

సుమారు రూ.25–35 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీశారు. దీని డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రిలీజ్‌కు ముందే నిర్మాణ వ్యయంలో ఎక్కువ భాగం వచ్చేసింది. కలెక్షన్ల పరంగా కూడా 'డ్యూడ్' రికార్డు సృష్టించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

55
ప్రదీప్ రంగనాథన్ రాబోయే సినిమాలు
Image Credit : our own

ప్రదీప్ రంగనాథన్ రాబోయే సినిమాలు

'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్'.. ఇలా మూడు సినిమాలనూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చిన ఏకైక యంగ్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గా ప్రదీప్ రంగనాథన్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రదీప్ తర్వాతి సినిమాలపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved