- Home
- Entertainment
- Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన ఓ స్టార్ హీరో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి కొడుకు పుట్టగానే చిరంజీవి జాతకం చెప్పారట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కొత్త నటీనటుల్ని, యువ దర్శకులని ప్రోత్సాహించడం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన ఓ హీరోని చిరంజీవి ఎంతగానో ప్రోత్సాహిస్తున్నారట. ఈ విషయాన్ని ఆ హీరోనే చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని.
చిరంజీవి గురించి నాని కామెంట్స్
నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా సినిమా విడుదలైన ప్రతి సారీ చిరంజీవి గారు నన్ను అభినందిస్తుంటారు. ఆయనే ప్రత్యేకంగా ఒక లెటర్ లాగా టైప్ చేసి నాకు మెసేజ్ పెడుతుంటాయారు. చిరంజీవి గారితో తొలిసారి ఎక్కువగా మాట్లాడింది మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోనే. అప్పటి నుంచి ఆయనతో చనువు పెరిగింది. శ్యామ్ సింగ రాయ్, దసరా ఇలా నా సినిమా ఏది విడుదలైనా చిరంజీవి గారి నుంచి మెసేజ్ వస్తుంది.
నాని కొడుకు జాతకం చెప్పిన చిరు
అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. నా కొడుకు జున్ను పుట్టినప్పుడు చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. అప్పటికి ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాం. చిరంజీవి గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. బాబు జన్మించిన టైం, నక్షత్రం ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. వాటిని బట్టి ఆయనకు తెలిసిన జాతకం చెప్పారు. ఏ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటుంది అనేది వివరించారు అని నాని పేర్కొన్నారు.
శ్యామ్ సింగ రాయ్ మూవీ చూస్తూ..
శ్యామ్ సింగ రాయ్ సినిమాని ఆయన ఇంట్లో హోమ్ థియేటర్ లో వేసుకుని చూశారట. సినిమా చూస్తున్న సమయంలో పనివాళ్ళు స్నాక్స్ తీసుకుని వచ్చారట. చిరంజీవి ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడంతో చిరంజీవి తిట్టి వెనక్కి పంపేశారట. అంతలా ఆయనకు శ్యామ్ సింగ రాయ్ మూవీ నచ్చేసింది.
నాని ప్యారడైజ్ మూవీ
తన సతీమణి సురేఖ గారితో కలిసి చిరంజీవి గారు శ్యామ్ సింగ రాయ్ మూవీ చూశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ లో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

