- Home
- Entertainment
- ఆడియెన్స్ తో కలిసి హాలీవుడ్ మూవీ చూసిన ప్రభాస్.. పక్కనే ప్రశాంత్ నీల్.. ఇది అస్సలు ఊహించరు
ఆడియెన్స్ తో కలిసి హాలీవుడ్ మూవీ చూసిన ప్రభాస్.. పక్కనే ప్రశాంత్ నీల్.. ఇది అస్సలు ఊహించరు
ప్రభాస్ థియేటర్లో ఆడియెన్స్ తో కలిసి సినిమా చూడటం చాలా అరుదు. అలా చూసి చాలా ఏళ్లే అవుతుంది. తాజాగా ఆయన హాలీవుడ్ మూవీని వీక్షించడం వైరల్‌గా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఆడియెన్స్ మధ్య థియేటర్లో సినిమా చూసి ప్రభాస్
ప్రభాస్ సాధారణంగా బయట కనిపించరు. చాలా తక్కువ సమయంలోనే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంటారు. తన సినిమా ప్రమోషన్స్ లో కనిపిస్తుంటారు.
మరోవైపు సినిమా సెట్‌లో అరుదుగా ఫ్యాన్స్, టీమ్‌తో ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ ఆడియెన్స్ మధ్య సినిమా చూడటం ఆశ్చర్యపరుస్తుంది.
దీంతో ఇప్పుడు డార్లింగ్ ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్నారు. ఆడియెన్స్ మధ్య ఆయన సినిమా చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
ప్రశాంత్ నీల్‌తో కలిసి `ఎఫ్ 1` సినిమా చూసిన ప్రభాస్
ప్రభాస్ ప్రసాద్ ఐమాక్స్ లో హాలీవుడ్ సినిమా చూశారు. సోమవారం రాత్రి ఆయన ఈ చిత్రాన్ని తిలకించినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్‌తోపాటు పక్కనే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు.
వీరిద్దరు సినిమాని సీరియస్‌గా చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తుంది. వీరిద్దరు కలిసి హాలీవుడ్ మూవీ `ఎఫ్ 1`ని వీక్షించారు. ప్రసాద్ ఐమాక్స్ లోని పీసీఎక్స్ బిగ్ స్క్రీన్‌లో ఈ మూవీని వీక్షించినట్టు తెలుస్తోంది.
బ్లాక్ డ్రెస్‌లో నయా లుక్‌లో ప్రభాస్ హల్‌చల్
ఈ సందర్భంగా డార్లింగ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సిబ్బందితోనూ ఫోటోకి పోజులిచ్చింది. ఈ పిక్ సైతం వైరల్‌గా మారింది. ఇందులో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది.
ఆయన బ్లాక్ డ్రెస్, బ్లాక్ గ్లాసెస్ ధరించారు. గెడ్డంతో కనిపిస్తున్నారు. అయితే ప్రభాస్ ఇలా థియేటర్‌కి వచ్చి సినిమా చూడటం చాలా అరుదు.
ఎప్పుడో `బాహుబలి`కి ముందు అడపాదడపా కనిపించేవారు. కానీ ఆ తర్వాత ఆయన థియేటర్లో సినిమా చూసినట్టు ఎప్పుడూ కనిపించలేదు.
చాలా ఏళ్ల తర్వాత ఇలా అభిమానులతో థియేటర్లో ప్రభాస్ సినిమా చూడటం విశేషం. ఇది ఆయన ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న `సలార్ 2`
అదే సమయంలో ప్రభాస్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో `సలార్` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అయ్యింది. త్వరలోనే రెండో పార్ట్ `సలార్ 2` రావాల్సి ఉంది.
`సలార్` నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధానికిది నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో `డ్రాగన్` మూవీ చేస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ `ది రాజాసాబ్`లో నటిస్తున్నారు. ఇది డిసెంబర్‌లో విడుదల కానుంది. దీంతోపాటు హను రాఘవపూడితో `ఫౌజీ` చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.
వీటితోపాటు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మలతో సినిమాలు చేయనున్నారు. అలాగే `సలార్ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపుతున్న `ఎఫ్ 1` మూవీ
ఇక ప్రభాస్ చూసిన హాలీవుడ్ మూవీ `ఎఫ్ 1`లో బ్రాడ్ పిట్ హీరోగా నటించడం విశేషం. ఫార్ములా వన్ రేస్ ఆధారంగా చేసుకుని ఒకప్పటి దిగ్గజ రేసర్ సోన్నీహేవ్స్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రానికి జోసెఫ్ కొసింస్కీ దర్శకత్వం వహించారు.
గత నెల 27న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల ఐదువందల కోట్లు వసూలు చేసింది. ఇండియాలో దాదాపు రూ.70 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం.