- Home
- Entertainment
- నాగార్జున హీరోగా పరిచయం కావాల్సిన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి.. అల్లు అర్జున్ కి జాక్ పాట్
నాగార్జున హీరోగా పరిచయం కావాల్సిన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి.. అల్లు అర్జున్ కి జాక్ పాట్
కింగ్ నాగార్జున హీరోగా పరిచయం కావాల్సిన మూవీని చిరంజీవి హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నాగ్‌ని పెద్ద దెబ్బకొట్టాడు. ఆ మూవీ ఏంటో ఇందులో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

నాగార్జున పరిచయం కావాల్సిన మూవీతో చిరు బ్లాక్‌బస్టర్
అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. విదేశాల్లో చదువుకుని వ్యాపారం చేయాలనుకున్న నాగ్ మనసు సడెన్‌గా మారింది.
సినిమాల్లోకి రావాలనుకున్నారు. ఏఎన్నార్‌కి ఈ విషయం చెప్పడంతో ఆయన ఓకే చెప్పారు. మొత్తానికి 1986లో `విక్రమ్` సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు నాగార్జున.
యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రంతో ఆకట్టుకున్నాడు. అయితే నాగ్ చేయాల్సిన మొదటి మూవీ ఇది కాదు. ఆ సినిమాని చిరంజీవి చేసి సూపర్ హిట్ కొట్టాడు.
`విజేత` చేయాల్సింది, `విక్రమ్`తో పరిచయం
నాగార్జున హీరోగా పరిచయం కావాలనుకున్న సినిమా `విజేత`. ఈ మూవీ బెంగాలీ చిత్రానికి రీమేక్. అక్కడ `సాహేబ్`గా వచ్చి హిట్ అయ్యింది. తెలుగు రీమేక్ రైట్స్ నిర్మాత అల్లు అరవింద్ వద్ద ఉన్నాయి. ఆయన ఇవ్వలేదు.
దీంతో మరో హిందీ రీమేక్ చేశారు నాగ్. 1983లో బాలీవుడ్‌లో వచ్చిన `హీరో` మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అందులో మార్పులు చేసి నాగార్జునతో తెరకెక్కించారు. అదే `విక్రమ్`.
రొమాంటిక్ యాక్షన్‌గా వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జస్ట్ ఓకే అనిపించింది. వీ మధుసూధన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున సరసన శోభన హీరోయిన్‌గా నటించింది.
`సాహేబ్` కథతో `విజేత` చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి
ఇక అల్లు అరవింద్ `సాహేబ్` కథలో మార్పులు చేయించి చిరంజీవి హీరోగా రూపొందించారు. `విజేత` టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుప్రియ హీరోయిన్‌గా నటించింది.
శారద ముఖ్య పాత్ర పోషించింది. 1985లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు.
యువతని ఇన్‌స్పైర్ చేసే మూవీ `విజేత
అయితే `ఖైదీ` లాంటి యాక్షన్ సినిమాతో మెప్పించిన చిరంజీవి వరుసగా అలాంటి చిత్రాలతో అలరిస్తున్న సమయంలో కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
అదే సమయంలో టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాలకు జనం బ్రహ్మరథం పడతారని నిరూపించిన చిత్రమిది. ఇందులో హీరో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రాణించాలనుకుంటారు.
కానీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫ్యామిలీ కోసం తన కిడ్నీని దానం చేసేందుకు సిద్ధపడటమే ఈ చిత్ర కథ.
ఆద్యంతం సెంటిమెంట్, ఎమోషనల్ మేళవింపుగా సాగే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అదే సమయంలో యువతని బాగా ఇన్‌స్పైర్ చేసే మూవీగానూ నిలవడం విశేషం.
`విజేత`తో బాలనటుడిగా పరిచయం అయిన అల్లు అర్జున్
అలా నాగార్జున చేయాల్సిన `విజేత` చిత్రాన్ని చిరంజీవి చేశారు. నాగ్ పెద్ద హిట్‌ని మిస్ చేసుకోగా, చిరు సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కారు.
అయితే ఇందులో అల్లు అర్జున్ బాలనటుడిగా నటించారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రమిదే. ఓ రకంగా బన్నీకిది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.
ఒకవేళ నాగ్ ఈ మూవీ చేసి ఉంటే అల్లు అర్జున్‌కి ఆ ఛాన్స్ వచ్చేది కాదు. మొత్తంగా `విజేత` మెగాస్టార్‌ని విజేతగా నిలిపిందని చెప్పొచ్చు.