MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?

ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ను  శాసించబోయే 50 ఏళ్లలోపు టాప్ హీరోల లిస్ట్ ను ఓర్మాక్స్ మీడియా రిలీజ్  చేసింది. రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు, భారీ ఇమేజ్ , క్రేజీ లైనప్‌లతో స్టార్‌డమ్‌కు కొత్త అర్థం చెప్పిన  స్టార్స్ ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు
Image Credit : PR Handout

బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు

మారుతున్న భారతీయ సినిమా రంగంలో ప్రాంతీయ హద్దులు చెరిగిపోతున్నాయి. ఈ సమయంలో కొందరు హీరోలు పాన్-ఇండియా స్థాయిలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతీ మార్కెట్‌లోనూ బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంటూ తమ పరిధిని విస్తరించుకుంటున్నారు. 2026లో ఇండియన్ సినిమాను శాసించబోయే 50 ఏళ్లలోపు టాప్ 10 స్టార్ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. అందులో మన సౌత్ హీరోలు ఎవరున్నారంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Image Credit : PR Handout

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

'ఐకాన్ స్టార్'గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్,  ఇండియన్  సినిమాలో మోస్ట్ వాంటెడ్ స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద స్టార్ అయినప్పటికీ, 'పుష్ప 2: ది రూల్' అద్భుతమైన విజయంతో అతని పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటింది. కెరీర్ బిగినింగ్ లో  'ఆర్య', 'బన్ని', 'రేసుగుర్రం' వంటి  హిట్‌ల నుంచి 'అల వైకుంఠపురములో' వంటి కమర్షియల్ సక్సెస్‌ల వరకు, అల్లు అర్జున్ తన మాస్ అప్పీల్‌తో పాటు డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లో కొత్తదనం చూపిస్తూ.. కెరీర్ ను బిల్డ్ చేసుకున్నాడు. 

36
యంగ్ టైగర్ ఎన్టీఆర్
Image Credit : PR Handout

యంగ్ టైగర్ ఎన్టీఆర్

'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా అభిమానులు పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, ప్రేక్షకులతో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాడు. తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డ్యాన్స్, యాక్షన్ స్కిల్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆఫ్-స్క్రీన్‌లో అతను చాలా సింపుల్‌గా ఉండటం, కెరీర్‌లో ఎన్నోసార్లు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం అతని మాస్ అప్పీల్‌ను మరింత పెంచింది.
46
ప్రభాస్
Image Credit : PR Handout

ప్రభాస్

గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఒక శక్తి. తిరుగులేని పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమాలతో ఆకాశమే హద్దుగా ఎదిగాడు. ఆ తర్వాత 'సలార్: పార్ట్ వన్ - సీజ్‌ఫైర్', 'కల్కి 2898 AD' వంటి బ్లాక్‌బస్టర్లతో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. సలార్, కల్కి సీక్వెల్స్‌తో పాటు 'స్పిరిట్', 'ఫౌజీ' వంటి సినిమాలతో ప్రభాస్ ఇండియన్ సినిమాలో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్‌గా కొనసాగుతున్నాడు.
56
రిషబ్ శెట్టి
Image Credit : PR Handout

రిషబ్ శెట్టి

నటుడు, ఫిల్మ్‌మేకర్, నిర్మాత అయిన రిషబ్ శెట్టి కన్నడ సినిమాలో ఒక పెద్ద శక్తిగా ఎదిగాడు. పాన్ ఇండియాలోనే అతిపెద్ద నటుడు, రచయిత, దర్శకుడు, సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొదట దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, 'కాంతార' సినిమాతో పాన్-ఇండియా కథనానికి కొత్త అర్థం చెప్పాడు. కన్నడ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అతను 'జై హనుమాన్' సినిమాలో కనిపించనున్నాడు.
66
రాక్ స్టార్ యష్..
Image Credit : PR Handout

రాక్ స్టార్ యష్..

'KGF: చాప్టర్ 1'తో యష్ పాన్ ఇండియా సినిమా ముఖచిత్రాన్నే మార్చేశాడు. ఒక్క రాత్రిలోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అతని 'రాఖీ భాయ్' పాత్ర అన్ని భాషల్లో  ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. 'KGF: చాప్టర్ 2' సినిమాతో కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపి, తన సూపర్‌స్టార్ హోదాను పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం యష్ 'టాక్సిక్', సినిమాతో అభిమానులను ఊరిస్తున్నాడు. అంతే కాదు  రామాయణ సినిమాలో యష్ ను రావణుడి పాత్రలో చూడటానికి అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   భాషతో సంబంధం లేకుండా, తమ ప్రభావంతోనే ఈ స్టార్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని  ఓర్మాక్స్ మీడియా వెల్లడించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Related Stories
Recommended image1
Peddi : పెద్ది సెట్‌లో అసలు పెద్దలు.. చిరంజీవి, సుకుమార్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్
Recommended image2
Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved