MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?

Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?

Pradeep Rawat: భారతీయ సినిమా సీనియర్ నటుడు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకులకు విలన్ పాత్రలతో సుపరిచితుడైన ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 04 2026, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రదీప్ రావత్ కన్నుమూత
Image Credit : Instagram

ప్రదీప్ రావత్ కన్నుమూత

ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా సీనియర్ స్టార్ ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన అనేక భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, ఆగస్టు 4న సాయంత్రం ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు యశ్‌పాల్ శర్మ సోషల్ మీడియాలో పంచుకోవడంతో, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సై సినిమాలో విలన్ ప్రదీప్ రావత్
Image Credit : X

సై సినిమాలో విలన్ ప్రదీప్ రావత్

ప్రదీప్ రావత్ తన కెరీర్‌ను బీ.ఆర్. చోప్రా 'మహాభారతం' టీవీ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభించారు. ఆ తర్వాత 'లగాన్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సై సినిమాలో భిక్షుయాదవ్ గా ఆయన నటన చాలా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. అంతే కాదు  సై' సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆతరువాత తెలుగులో వరుసగా  చత్రపతి, ఆంజనేలు, యోగి, స్టాలిన్, అందరివాడు ఇలా దాదాపు 70 కి పైగా తెలుగు సినిమాల్లో నటించాడు ప్రదీప్ రావత్.

35
గజినీ సినిమాతో తమిళంలో ఫేమస్..
Image Credit : Instagram

గజినీ సినిమాతో తమిళంలో ఫేమస్..

ఇక తెలుగుతో పాటు తమిళంలో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజినీ' సినిమా ఆయనకు తమిళంలో ప్రత్యేక స్థానం కల్పించింది. సూర్యకు విలన్‌గా ఆయన నటనకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన హిందీ రీమేక్‌లో కూడా ఆయనే విలన్‌గా నటించారు.తన ఎత్తైన ఆకారం, గంభీరమైన బాడీ లాంగ్వేజ్, పదునైన కంఠంతో భారతీయ సినిమాలో ప్రత్యేకమైన విలన్‌గా నిలిచారు.

45
దాదాపు 150 సినిమాల్లో రకరకాల పాత్రలు..
Image Credit : X

దాదాపు 150 సినిమాల్లో రకరకాల పాత్రలు..

ప్రదీప్ రావత్ ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో కలిపి 150కి పైగా చిత్రాల్లో నటించారు. తన భయంకరమైన చూపులు, గంభీరమైన గొంతు, నటనతో దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

55
సోషల్ మీడిాయాలో అభిమానుల నివాళి..
Image Credit : stockPhoto

సోషల్ మీడిాయాలో అభిమానుల నివాళి..

ప్రదీప్ రావత్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మదిలో భిక్షు యాదవ్ గా  ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?
Recommended image2
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved