MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?

IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?

IMDb ఈ వారం 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో చాలామంది పాపులర్ నటీనటులు, డైరెక్టర్లు చోటు దక్కించుకున్నారు. కొత్త సినిమాలు, రాబోయే ప్రాజెక్టుల కారణంగా ఈ లిస్ట్‌లో ఊహించని మార్పులు జరిగాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 04 2026, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IMDb పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌
Image Credit : others

IMDb పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌

ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ IMDb ఈ వారం 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' లిస్ట్‌ను విడుదల చేసింది. ఇటీవల రిలీజైన సినిమాలు, రాబోయే భారీ ప్రాజెక్టుల కారణంగా ఈ వారం లిస్ట్‌లో చాలా మార్పులు కనిపించాయి. కొందరు స్టార్ల ర్యాంకులు పడిపోగా, కొత్తవాళ్లు టాప్‌లోకి దూసుకొచ్చారు.

ఈ వారం లిస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతూ సత్తా చాటుతున్న 'ముసాఫిర్ కేఫ్' వెబ్ సిరీస్ నటీనటుల హవా నడిచింది. ఈ సిరీస్ హీరోయిన్ వేదిక పింటో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మరో నటి మహిమా మక్వానా రెండో స్థానంలో నిలిచింది. ఇక నటుడు విక్రాంత్ మ్యాస్సీ నాలుగో ర్యాంకును దక్కించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'ముసాఫిర్ కేఫ్' హవా!
Image Credit : instagram

'ముసాఫిర్ కేఫ్' హవా!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి 'ముసాఫిర్ కేఫ్' సిరీస్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రచయిత దివ్య ప్రకాశ్ దూబే రాసిన పాపులర్ నవల ఆధారంగా రుచిర్ అరుణ్ ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్‌ను తెరకెక్కించారు. కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ ప్రభావమే ఇప్పుడు IMDb ర్యాంకులపై స్పష్టంగా కనిపిస్తోంది.

35
టాప్ 10లో కియారా, హ్యూమా!
Image Credit : YouTube

టాప్ 10లో కియారా, హ్యూమా!

మరోవైపు, భారీ అంచనాలతో రాబోతున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్', 'రామాయణ్' సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా ఈ ర్యాంకుల్లో కనిపించింది. 'టాక్సిక్' సినిమా హీరోయిన్ కియారా అద్వానీ మూడో స్థానంలో నిలిచింది. ఇదే సినిమాలో నటిస్తున్న హ్యూమా ఖురేషి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమా 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ లాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది.

45
లిస్ట్‌లో 'రామాయణ్' టీమ్
Image Credit : Instagram

లిస్ట్‌లో 'రామాయణ్' టీమ్

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ్' సినిమా డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ వారం IMDb లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక 'టాక్సిక్', 'రామాయణ్' రెండు సినిమాల్లోనూ భాగమైన రాకింగ్ స్టార్ యశ్ ఈ వారం 12వ స్థానంలో ఉన్నాడు. నితేశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న 'రామాయణ్' సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. యశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

55
IMDb లిస్ట్‌లో ఎవరికి ఏ ర్యాంక్?
Image Credit : INSTAGRAM

IMDb లిస్ట్‌లో ఎవరికి ఏ ర్యాంక్?

ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ ర్యాంకులు పొందిన వారిలో కొందరు:

వేదిక పింటో - 1వ స్థానం

మహిమా మక్వానా - 2వ స్థానం

కియారా అద్వానీ - 3వ స్థానం

విక్రాంత్ మ్యాస్సీ - 4వ స్థానం

హ్యూమా ఖురేషి - 8వ స్థానం

నితేశ్ తివారీ - 9వ స్థానం

యశ్ - 12వ స్థానం

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Related Stories
Recommended image1
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
Recommended image2
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved