ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో. సినిమాకు 150 నుంచి 200 కోట్లు తీసుకునే హీరో. ప్రభాస్ తో సినిమా అంటే వేల కోట్ల బిజినెస్ అంచనాలు ఉంటాయి. అటువంటి స్టార్ హీరో రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. దాదాపు అరడజను సినిమాలు లైన్ లో పెట్టాడు. అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కేవే. ప్రస్తుతం ప్రభాస్ ను ముందు పెట్టి దాదాపు 5 వేల కోట్ల పైనే బిజినెస్ జరుగుతోంది. ఆయన సినిమాలతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభాస్ కూడా వందల కోట్ల రెమ్యునరేషన్ తో వెలుగు వెలుగుతున్నాడు. వరుసగా సలార్ సినిమాతో పాటు కల్కి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ప్రభాస్ కు కలిసి వచ్చింది.
Also Read: రష్మిక ను విజయ్ దేవరకొండ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?
Actor Prabhas starrer film The Raja Saabs update out
కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ప్రభాస్ మునుపటి వైభవాన్ని సాధించాడు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మారుతీతో చేస్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఉగాదిరోజు స్టార్ట్ కాబోతోంది. మరో వైపు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ పేరు ప్రచారంలో ఉన్న సినిమా ఇప్పటికే షూటింగ్ షురు అయ్యింది. అటు ప్రశాంత్ నీల్ సలార్ 2 స్టార్ట్ చేయాల్సి ఉంది.
Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?
The Raja Saab Prabhas film update out
ఇవి కాకుండా ప్రభాస్ తో సినిమా కోసం మరికొంత మంది దర్శకులు ఎదురు చూస్తుండగా.. వారిలో ఇద్దరికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సరే ఇవన్నీ పక్కన పెడితే.. ఎక్కడో రెండు మూడు కోట్ల రెయ్యునరేషన్ రేంజ్ నుంచి.. 50 కోట్లు.. 100 కోట్లు.. ఇప్పుడు 150 నుంచి ర200 కోట్ల రెమ్యునరేషన్ రేంజ్ కు వెళ్ళాడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత అతని రేంజ పెరిగిపోయింది. ఆతరువాత హ్యాట్రిక్ ప్లాప్ లు పలకరించినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Also Read: లైలా మూవీ ట్విట్టర్ రివ్యూ, విశ్వక్ సేన్ ప్రయోగం ఫలించిందా?
ప్రస్తుంతం మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే నిమిషానికి కూడా లెక్క గట్టి ఇవ్వాల్సిందే. అటువంటిది ఆయన ఒక సినిమా ను ఫ్రీగా చేయడం అంటే మాటలు కాదు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ తన వాల్యుబుల్ టైమ్ ను రూపాయి కూడా తీసుకోకుండా ఓ సినిమాకు కేటాయించాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.?
Also Read: మూడు పెళ్లిళ్లు చేసుకున్న మహానుభావులు
Kannappa Prabhas is introduced as Rudra
ఆమూవీ మరేదో కాదు కన్నప్ప. ఈసినిమాలో ప్రభాస్ దాదాపు 40 నిమిషాలు కనిపిస్తారట. ఈ 40నిమిషాలు అంటే ఎంత లేదన్నా ఓ 50 కోట్లు సమర్పించుకోవలసి ఉంటుంది. అటువంటిది కన్నప్ప సినిమా కోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశాడట ప్రభాస్. మంచు విష్ణు కన్నప్పగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.
Kannappa Teaser
ఇక ఈ భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమాను మంచు మోహన్ బాబు దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్రలో కూడా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు టీమ్.