రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈక్రమంలో రష్మికకు విజయ్ దేవరకొండ పెట్టిన ముద్దు పేరు గురించి వైరల్ అవుతుంది. ఇంతకీ రౌడీ హీరో నేషనల్ క్రష్ ను ఏమని పిలుస్తాడు..?

విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుస ప్లాప్ సినిమాలతో విజయ్ ఇమేజ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలిసిందే. గీత గోవిందం తరువాత ఆరేంజ్ లో సాలిడ్ హిట్ పడలేదు విజయ్ కు. రకరకాల జానర్లు ట్రై చేశాడు, ఎన్నో ప్రయోగాలు చేశాడు. డిఫరెంట్ రోల్స్ ట్రై చేశాడు. ఇలా ఎంత ప్రయత్నించినా..మంచి కథ, దానికి తగ్గ దర్శకుడు, విజయ్ కుసెట్ అవ్వలేదు. అందులోనే విజయ్ నటన కూడా మోనాటనీ అయిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?
Vijay Deverakonda
అయితే ఈక్రమంలో విజయ్ తాజాగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో డిపరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈసినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ ను పెట్టారు. తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈటీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. రోమన్ శిల్పంలా తయారయ్యాడు రౌడీ హీరో. చాలా డిఫరెంట్ గా ఉంది టీజర్. టాలీవుడ్ మేకింగ్ కు భిన్నంగా ఉంది. కాస్త హాలీవుడ్ సినిమాలను తలపించింది. ఏది ఏమైనా ఈసారి హిట్ కొడతాడేమో చూడాలి.
అయితే కాస్త విజయ్ సినిమాల గురించి పక్కన పెడితే.. ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టే చాలా సార్లు ఇన్ డైరెక్ట్ గా ఈ జంట దొరికిపోయింది కూడా. ఇంత ప్రచారం జరుగుతున్నా ఎప్పుడు ఈ విషయంలో ఇద్దరిలో ఎవరు ఖండించలేదు కూడా. దీన్ని బట్టి.. వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అనేది నిజమే అని అంటున్నారు ఫ్యాన్స్. రష్మిక ఎక్కడ కనిపించినా... విజయ్ ఫ్యాన్స్ వదినా అంటూ పలకరిస్తున్నారు.
Also Read:మెగాస్టార్ మాట సాయంతో 500 సినిమాలు చేసిన స్టార్ కమెడియన్ ఎవరు?
ఈక్రమంలో రష్మికను విజయ్ దేవరకొండ ముద్దుగా ఏమని పిలుస్తాడు అనేది ఇప్పుడు హైలెట్ అవుతోంది. కింగ్ డమ్ టీజర్ రిలీజ్ సందర్భంగా విజయ్ ను సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది రష్మిక. దాంతో ఆమెకు రిప్లే ఇచ్చాడు రౌడీ హీరో. రిప్లే ఇస్తూ.. ఆమెను రిషి అని సంబోధించాడు. దాంతో విజయ్ రష్మికను ముద్దుగా రిషి అని పిలుస్తాడని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోరు.
Also Read:మూడు పెళ్లిళ్లు చేసుకున్న మహానుభావులు
ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ పేరు విజయ్ పెట్టాడా.. లేక ఇంట్లో కూడా ఆమెను రిషీ అనే పిలుస్తారా అనేది మాత్రం తెలియడం లేదు. మొత్తానికి రష్మికమందన్న ముద్దు పేరుమాత్రం రిషి అని అందరికి తెలిసిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది రష్మిక. రీసెంట్ గా పుష్ప2 తో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.