- Home
- Entertainment
- చెట్టు కోసం కోటి రూపాయలు, అంబానీ తో పోటీ పడ్డ ప్రభాస్, అంత ప్రత్యేకత ఏంటి? నిజమెంత
చెట్టు కోసం కోటి రూపాయలు, అంబానీ తో పోటీ పడ్డ ప్రభాస్, అంత ప్రత్యేకత ఏంటి? నిజమెంత
ఒక చెట్టు కోసం ఎవరైనా కోటి రూపాయలు ఖర్చు చేస్తారా? కాని హీరో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన వృక్షం కోసం కోటి ఖర్చు చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అంత ప్రత్యేకత అందులో ఏముంది.
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో
టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ వైపు ప్రపంచం చూపుపడేలా చేశాడు ప్రభాస్. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. బాహుబలి తరువాత వరుసగా మూడు ప్లాప్ లు ఎదురైనా కాని.. ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ కోసం నిర్మాతలు ఇప్పటికీ ఇందు ముందు క్యూ కడుతూనే ఉన్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ తో సినిమా చేయాలంటే కనీసం 500 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే.
ప్రభాస్ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమాకు 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే ప్లాప్ అయినా సరే వందల కోట్ల కలెక్షన్లు రాబడతాయి. ప్రస్తుతంఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఈసినిమాలు కంప్లీట్ చేయాలంటే దాదాపు ఐదారేళ్లకు పైనే సమయం పడుతుందని అంచన. ప్రభాస్ కు జపాన్, జర్మనీ, చైనా లాంటి దేశాల్లో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం ఖర్చు పెట్టుకుని మరీ వారి దేశాల నుంచి హైదరాబాద్ వచ్చి, ప్రభాస్ ఇంటి ముందు ఎదురుచూస్తుంటారు.
అడవిని దత్తత తీసుకున్న యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్ సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదించడమే కాదు సమాజసేవలో కూడా ముందున్నారు. ఆయన విరాళం ఇచ్చాడంటే అది భారీ స్థాయిలో ఉంటుంది. అందుకే ఆయనకు భోళా శంకరుడు అనే పేరు కూడా ఉంది. రాజుల కుటుంబంలో పుట్టిన ప్రభాస్.. దానధర్మాలు చేయడంలో నిజమైన రాజు అనిపించుకున్నాడు. వరదలు వచ్చినా..విపత్తులు వచ్చినా.. ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించడంలో వెనకడుగు వేయడు ప్రభాస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో ప్రభాస్ కోట్లలో విరాళాలు ప్రకటించిన సంరద్భాలు ఉన్నాయి. అంతే కాదు కొన్ని ఎకరాల్లో అడవులను దత్తత తీసుకుని.. వాటికోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నాడు స్టార్ హీరో.
ప్రభాస్ ఆతిథ్యం మామూలుగా ఉండదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాదిరిగానే ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రభాస్ కూడా మంచి భోజన ప్రియుడు. ఆయన తినడంతో పాటు తన తోటి నటులకు కూడా జీవితంలో మర్చిపోలేని విధంగా ఆతిథ్యం ఇస్తుంటారు. ప్రభాస్ సెట్ లో ఉన్నారంటే..అరుదైన వంటకాల వాసనలతో సెట్ అంతా ఘుమఘుమలాడిపోతుంటుంది. ఆయన ఆతిథ్యం మామూలుగా ఉండదు.. పదిరకాల నాన్ వెజ్ వంటలతో అదిరిపోయే విందు ఇవ్వడంతో ప్రభాస్ తరువాతే ఎవరైనా. ప్రభాస్ టీమ్ కు అడిగిన వంటలు చేసిపెట్టడానికి ప్రత్యేకంగా ఒక చెఫ్ టీమ్ పని చేస్తుంది. సెట్ లో ఉన్న స్టార్ హీరో నుంచి లైట్ బాయ్ వరకూ అందరికి ఒకే భోజనం అందేలా చూస్తుంటాడు ప్రభాస్.
చెట్టు కోసం 1 కోటి ఖర్చు చేసిన ప్రభాస్
చెప్పుకుంటూ వెళ్తే ప్రభాస్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈక్రమంలోనే తాజాగా ఆయన మరో అద్భుతం చేశారు. అరుదైన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. ఒక చెట్టుకోసం కోటి రూపాయలు ఖర్చు చేశాడట ప్రభాస్. చెట్టుకోసం కోటి ఏంటి, అంత ప్రత్యేకత ఏంటి ఆ చెట్టులో? అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ చెట్టు పేరు కల్పవృక్షం అని పిలుస్తారట. దేవతా వృక్షంగా పిలుచుకునే ఈ చెట్టుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పురాణాల్లో అడిగింది ఇచ్చే వృక్షంగా దీనికి పేరుంది.
ఈ కల్పవృక్షం ఇంట్లో ఉంటే అంతా మంచి జరుగుతుంది అని భావిస్తుంటారు. ఇంట్లో సిరిసంపదలు, ఆరోగ్యాలు, భోగ భాగ్యాలకు కొదవ ఉండదు అని ఒక నమ్మకం. అందుకే ప్రభాస్ తను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి ఆవరణలో ఈ వృక్షం నాటాడని టాలీవుడ్ టాక్. ఈ అద్భుతైమన చెట్టుకోసం కోటిరూపాయలు ఖర్చు చేశాడట ప్రభాస్. ఈ విషయంలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా, టాలీవుడ్ లో మాత్రం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
అంబాని తరువాత ప్రభాస్ దే రికార్డ్
ఇలాంటి కల్పవృక్షం దేశంలో ఒక్క ముఖేష్ అంబానీ దగ్గర మాత్రమే ఉందని సమాచారం. అంబాని తరువాత ఆ చెట్టును కొన్న రెండో వ్యక్తిగా ప్రభాస్ రికార్డ్ సాధించారు. ఈరకంగా ప్రభాస్ అంబానీతో పోటీపడ్డారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కు రెడీగా ఉంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈమూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
రాజాసాబ్ తో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో మరో మూవీ షూటింగ్ లో ఉంది. వీటితో పాటు సలార్ పార్ట్ 2, కల్కీ పార్ట్ 2 సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఈసినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. ఈసినిమాలతో పాటు మరికొన్ని కథలు లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం కొంత మంది డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.