- Home
- Entertainment
- మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐకాన్ స్టార్ వరకూ డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతోన్న స్టార్స్ ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐకాన్ స్టార్ వరకూ డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతోన్న స్టార్స్ ఎవరు?
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్యూయల్ రోల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అంతా ద్విపాత్రాభినయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే సినిమాల్లో డబుల్ రోల్ తో ఆకట్టుకోబోతున్న హీరోలు ఎవరో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

మూడు పాత్రలతో అలరించిన మెగాస్టార్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒక్కొక్కసారి ఓల్డ్ ట్రెండ్స్ కూడా కొత్త రంగు పులుముకుని సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తుంటాయి. అలాంటి వాటిలో డ్యూయల్ రోల్ ట్రెండ్ కూడా ఉంది. ప్రస్తుతం మన హీరోలు ద్విపాత్రాభినయం వెంటపడుతున్నారు. డ్యూయల్ రోల్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు.
మరీ ముఖ్యంగా ఏడు పదుల వయస్సులో మెగాస్టార్ చిరంజీవి కూడా డబుల్ రోల్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ విత్ యాక్షన్ మూవీ చేస్తున్న చిరు, ఈసినిమాలో రెండు పాత్రల్లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో చాలా సినిమాల్లో చిరంజీవి డబుల్ రోల్ చేసి హిట్ కొట్టాడు. అంతే కాదు ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ట్రిపుల్ రోల్ చేసిన ఘనత కూడా ఆయన సొంతం.
అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్
ఇక స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అందరు ఏదో ఒక సందర్భంలో డ్యూయల్ రోల్ చేసిన వారే. కాని టాలీవుడ్ లో ఇప్పటి వరకూ రెండు పాత్రల్లో కనిపించని ఏకైక హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. బన్నీని రెండు పాత్రల్లో చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ముచ్చటను అట్లీ తీర్చబోతున్నాడు. వీరి కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీలో, అల్లు అర్జున్ రెండు పాత్రల్లో సందడిచేయబోతున్నట్టు తెలుస్తోంది.
మరో రూమర్ ఏంటంటే, ఈసినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అనేది మాత్రం అనేదీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే తప్ప తెలియదు. త్వరలో ఐకాస్ స్టార్ అభిమానులు మాత్రం బన్నీని డ్యూయల్ రోల్ లో చూసి పండగ చేసుకోబోతున్నారు.
రాజాసాబ్ లో ప్రభాస్ రెండు పాత్రలు
టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి సందడి చేశాడు. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా రెండు పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక తాజాగా మరోసారి యంగ్ రెబల్ స్టార్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.
మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఈసినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి, యంగ్ స్టార్ గా మరో పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. డిసెంబర్ 5న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. మరి మరోసారి డ్యూయల్ రోల్ లో ప్రభాస్ మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.
కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కూడా
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవకొండ చేస్తున్న సినిమా కింగ్డమ్. ఈసినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసినిమా హిట్ అయితే విజయ్ కెరీర్ కాస్త పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. ఈక్రమంలో విజయ్ ఈసినిమాలో రెండు పాత్రలు చేసినట్టు వార్త బయటకు వచ్చింది. మరి విజయ్ నిజంగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడా? యోధుడిగా ఒక పాత్ర లో కనిపించిన విజయ్.. కనిపించని ఆ రెండో షేడ్ ఏంటీ అనేది చూడాలి.
తండ్రీ కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఈమూవీ తరువాత మళ్లీ కొరటాలతో జాయిన్ కాబోతున్నాడు యంగ్ టైగర్. దేవర2 సెట్ లో సందడి చేయబోతున్నాడు. దేవరలో డబుల్ యాక్షన్ చూపించాడు యంగ్ టైగర్. ఇక సెకండ్ పార్టులో కచ్చితంగా తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలుంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. . తారక్‌ని తండ్రీకొడుకులుగా ఒకే ఫ్రేమ్ లో చూడ్డానికి ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
పూనకాలతో ఊగిపోతున్న బాలయ్య ఫ్యాన్స్
ఇక అఖండ2 విషయానికి వద్దాం.. ఇప్పటికే అఖండ సినిమాతో రచ్చ రచ్చ చేశాడు బాలయ్య. అఘోర పాత్రతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఈసారి అంతకు మించి ఇవ్వడానికి రెడీ అయ్యాడు నటసింహం. అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలయ్య ఊచకోత చూసి ఊగిపోయారు ఫ్యాన్స్. అఖండ 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మహేష్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్
ఇక మహేష్ బాబు కూడా ఈసారి డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ తో రాజమౌళి చేస్తోన్న పాన్ వరల్ మూవీలో మహేష్ బాబు రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. ఎస్ఎస్ఎంబీ29లో మహేష్‌ని డ్యూయల్ రోల్‌లో చూపించే అవకాశాలున్నాయని అప్పట్లో టాక్ స్ప్రెడ్ అయింది. నిజానిజాలేంటన్నది జక్కన్నకు మాత్రమే తెలియాలి.