- Home
- Entertainment
- 100 Crore Loss movies: వంద కోట్లకుపైగా నష్టాలను తెచ్చిన సినిమాలు.. ప్రభాస్, రామ్ చరణ్ సేమ్, సూర్య టాప్
100 Crore Loss movies: వంద కోట్లకుపైగా నష్టాలను తెచ్చిన సినిమాలు.. ప్రభాస్, రామ్ చరణ్ సేమ్, సూర్య టాప్
100 Crore Loss Movies: సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు మూవీస్ నష్టాలనే మిగుల్చుతాయి. కానీ ఊహించని నష్టాలు తీసుకురావడమే నిర్మాతలకు పెద్ద షాక్. మరి వంద కోట్లకుపైగా నిర్మాతలకు నష్టాలను తెచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం.

100 Crore Loss Movies: ఈ సంక్రాంతి భారీ కాసుల వర్షం కురిపించిన మూవీ ఉంది. అదే సమయంలో భారీగా నష్టాలను తీసుకొచ్చిన సినిమా ఉంది. ఈ సంక్రాంతి సినిమా వాళ్లకి పెద్ద గుణపాఠం నేర్పిందని చెప్పొచ్చు. అయితే మూడు నాలుగు వందల కోట్లు పెట్టిన తీసిన సినిమాకి పది ఇరవై కోట్లు పోవడం నిర్మాతలకు పెద్ద లాస్ కాదు, కానీ వందల్లో నష్టాలు వస్తే, అది మామూలు నష్టం కాదు, మామూలు నిర్మాత అయితే ఆస్తులమ్ముకోవడమే, అడ్రస్ లేకుండా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడమే జరుగుతుంది. కానీ తట్టుకుని నిలబడుతున్నారు. మరి అంతటి భారీ నష్టాలను చవి చూసిన సినిమాలేంటి? ఆ నిర్మాతలు ఎవరనేది చూస్తే.
వంద కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ఇటీవల రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` మూవీ ఉంది. ఇది వంద కోట్లకుపైగా నష్టాలను తీసుకొచ్చిందట. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన నష్టాలను దిల్ రాజు నిర్మించిన మరో మూవీ `సంక్రాంతికి వస్తున్నాం` కొంత వరకు భర్తీ చేయడంతో నిర్మాతలు సేవ్ అయ్యారు.
గతేడాది సూర్య హీరోగా వచ్చిన `కంగువా` మూవీకి కూడా వంద కోట్లకుపైగా నష్టాలను తీసుకొచ్చింది. శివ దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ హిస్టారికల్ మూవీ `కంగువా` సుమారు రూ. 135కోట్ల నష్టాలను తీసుకొచ్చిందట. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి డిజప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆయనకు `తంగలాన్` కొంత నష్టాలను తీసుకొస్తే, `కంగువా` మరింత షాకిచ్చింది. కోలుకోలేని దెబ్బకొట్టింది.
అలాగే ప్రభాస్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన హీరోగా రూపొందిన `రాధేశ్యామ్` కూడా భారీగా నష్టాలను తీసుకొచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, యూవీ క్రియేషన్స్ దీన్ని నిర్మించింది. ఈ మూవీ కూడా సుమారు రూ.120 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ నిర్మాతకు బ్యాక్ ప్రభాస్ ఉన్నారు. కాబట్టి తట్టుకుని నిలబడ్డారు. ఇప్పటికీ సర్వైవ్ అవగలుగుతున్నారు.
read more: Daaku Maharaaj Collections: `డాకు మహారాజ్` ఫైనల్ కలెక్షన్లు, బాలయ్యకి హిట్టా? ఫట్టా?
also read: ఫుడ్ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్ బ్లాక్