- Home
- Entertainment
- Daaku Maharaaj Collections: `డాకు మహారాజ్` ఫైనల్ కలెక్షన్లు, బాలయ్యకి హిట్టా? ఫట్టా?
Daaku Maharaaj Collections: `డాకు మహారాజ్` ఫైనల్ కలెక్షన్లు, బాలయ్యకి హిట్టా? ఫట్టా?
Daaku Maharaaj Collections: బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. మరి సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? హిట్టా ? ఫట్టా?

Nandamuri Balakrishnas Daaku Maharaajs collection report out
Daaku Maharaaj Collections: ప్రస్తుతం బాలయ్య టైమ్ నడుస్తుంది. ఆయన బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. వరుసగా నాలుగు హిట్లతో మంచి ఊపులో ఉన్నారు. దీనికితోడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వరించింది. దీంతో బాలయ్య జోరు మామూలుగా లేదని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్‌లో సక్సెస్ ఉన్న హీరో బాలయ్య ఒక్కరే కావడం విశేషం.
Balayyas Daaku Maharaaj monday collection report out
ఇక బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు.
శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఈ మూవీ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని అన్నారు. కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించిందీ మూవీ.
సినిమా విడుదలై 22 రోజులు అవుతుంది. ఈ రోజుతో దాదాపు క్లోజ్ కాబోతుంది. వచ్చే వారంలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 9న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే
సుమారు రూ.90కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తుంది. టీమ్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యిందని ప్రకటించింది. ఈ లెక్కన సుమారు ఈ మూవీ సుమారు రూ. 160-170కోట్లు కలెక్ట్ చేసిందని టాక్.
ఇదిలా ఉంటే సినిమా ఆ స్థాయిలో రాబట్టలేదని, రూ.65కోట్ల షేర్‌కే పరిమితమయ్యిందని ట్రేడ్ వర్గాల నుంచి వినిపించే మాట. ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` బయ్యర్ల ప్రెస్ మీట్‌లో చాలా సినిమాలు లాస్ వచ్చినా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలో `డాకు మహారాజ్` బ్రేక్ ఈవెన్ అయ్యిందా అనేది చర్చ. ఏదేమైనా ఈ మూవీ విషయంలో టీమ్ హ్యాపీగానే ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. `అఖండ`కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.
read more: ఫుడ్ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్ బ్లాక్
also read: `పూనకాలు లోడింగ్`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్