అల్లు అర్జున్, ప్రభాస్, NTR,రామ్ చరణ్.. స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ప్రభాస్, NTR,రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా ప్రస్తుతం వందలకోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా టాలీవుడ్ హీరోలు తమ మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారోతెలిస్తే నిజంగా షాక్ అవుతారు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన తనయుడు అనిపించురకున్నాడు మహేష్ బాబు. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినా..హీరోగా మాత్రం తన మొదటి రెమ్యూనరేషన్ గా 10 లక్షల రూపాయలను తీసుకున్నారట. ప్రస్తుతం 100 కోట్లకు దగ్గరలో ఉన్నట్టు సమాచారం. రాజమౌళి సినిమాకు 250 కోట్లు అంటున్నారు. మరి నిజమెంతో తెలియదు.
Also Read: అన్న ప్రాసనలో పవన్ కళ్యాణ్ ఏం పట్టుకున్నారో తెలుసా..? మెగా మదర్ అంజననాదేవి చెప్పిన టాప్ సీక్రెట్
ఆర్ఆర్ఆర్ తో గ్లోబలర్ ఇమేజ్ ను మూటగట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. నందమూరి నట వారస్వంతో సినిమాలు మొదలుపెట్టిన తారక్.. ఆతరువాత సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట తారక్... కాని తను చేసిన మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని కోసం 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడట జూనియర్ ఎన్టీఆర్.
ఇక మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్..చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు . చాలా స్టైలీష్ అండ్ మాస్ లుక్స్ లో ఈ సినిమాలో అదరగొట్టేసాడు రామ్ చరణ్ .
ఈ సినిమా కోసం చాలానె కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక సినిమాకి ఇప్పుడు 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చారు . అయితే ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ 50 లక్షలు అయని సమాచారం.
పాన్ వరల్డ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఆరడుగుల అందగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నాడు. కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్ హీరో.. తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం సినిమాకు 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?
గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తన మొదటి సినిమా కోసం 20 లక్ష రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే పుష్ప2 కోసం ఏకంగా 200 కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నాడట. ఐకాన్ స్టార్.
Also Read: చిరంజీవికి చెల్లెలు.. బాలయ్య హీరోయిన్.. సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఎవరో తెలుసా..?
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమా రెమ్యూనరేష్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. మొదటి మూవీకి చిరు 1116 పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కల్యాణ. ఆయన ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. 1996లో వచ్చిన ఈసినిమాకు ఆయన 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఒక సినిమా కోసం ఆయన 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read:
తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో నటించినందుకు విజయ్ దేవరకొండ అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇక తను సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ చెప్పేవాడట. అందుకుగాను అతను కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకునేవాడినని అదే నా మొదటి రెమ్యూనరేషన్ అని చెబుతాడు. ప్రస్తుతం సినిమాకు 50 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట రౌడీ హీరో.