హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తెలుగు సీరియల్ లో నటించాడని మీకు తెలుసా..? హీరో అవ్వకముందు బుల్లితెరపై నవీన్ నటించిన ఆ సీరియల్ ఏంటో తెలుసా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం ఒక ఎత్తయితే.. అందులో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. యంగ్ స్టార్ ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. టాలెంట్ ఉన్నా లక్కు లేనివారు కనుమరుగవుతున్నారు. టాలెంట్ లక్ కలిసి.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవారు స్టార్స్ గా మారుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు.
Also Read: స్నేహితులనే పెళ్లి చేసుకున్న సౌత్ హీరోయిన్లు
నెలకు నాలుగు లక్షల జీతాన్ని వదిలేసుకుని.. హీరో అవ్వాలన్న ఒక్క ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవీన్. రెండు, మూడు సినిమాలకే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. హైదరాబాద్ లో అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబం లో పుట్టి పెరిగిన నవీన్ పోలిశెట్టి, NIT భూపాల్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, లండన్ లో నెలకు నాలుగు లక్షల ఉద్యోగం చేసేవాడు.
సినిమాలమీద ప్రేమ అతన్ని ఉద్యోగం చేసుకోనివ్వలేదు. జాబ్ చేస్తున్నా..మనసంతా సినిమాలమీదకు లాగింది. దాంతో ఏంఆలోచించకుండా.. వెంటనే జాబ్ కు రిజైన్ చేసి.. నటుడు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇండియా కి తిరిగి వచ్చాడు. సినిమాల్లో అవకాశాలు అంత తేలికగా దొరకదా.. అంత పెద్ద జాబ్.. లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి.. తనకు నచ్చిన సినిమాలకోసం కాళ్ళు అరిగిపోయేలా అవకాశాల కోసం తిరిగాడు నవీన్.
Also Read:ఒక ఏడాదిలో 35 సినిమాల్లో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
కాని అందరిలా కాదు.. ఈ యంగ్ హీరోకు అదృష్టం కాస్త తొందరగానే తలుపుతట్టింది. అవకాశం వెంట వెంటనే అతన్ని పలకరించింది. అది కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపంలో. టాలీవుడ్ లో కొత్త ముఖాలను స్క్రీన్ కు పరిచయం చేసే దర్శకుడు ఎవరంటే వెంటనే శేఖర్ కమ్మముల పేరే వినిపిస్తుంటుంది. కొత్త టాలెంట్స్ ని వెతికి మరీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం శేఖర్ కమ్ములకు అలవాటు.
Also Read:బిగ్ బాస్ విన్నర్ కు అరుదైన వ్యాధి..? అభిజిత్ అందుకే ఇండస్ట్రీకి దూర అయ్యాడా..?
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ఎప్పటిలాగానే కొత్తవారికోసం వెతుకుతున్న శేఖర్ కమ్ములా ఓ ఆడిషన్ పెట్టారు ఆ ఆడిషన్ లో నవీన్ పోలిశెట్టి పాల్గొనడం.. అతని నటన నచ్చి శేఖర్ కమ్ముల అవకాశం ఇవ్వడం జరిగిపోయింది. ఈ సినిమాతో నటుడిగా నవీన్ పోలిశెట్టి కి మంచి పేరు వచ్చింది. ఇక ఆతరువాత మనోడు అవకాశాలు అందిపుచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ లో ఓ షోకి యాంకర్ గా సెలక్ట్ అయ్యాడు.
అక్కడే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పరిచయం స్నేహం కూడా ఏర్పడింది నీవీన్ కు. ఇటు తెలుగులో క్యారెక్టర్ రోల్స్.. అటు బాలీవుడ్ అవకాశాలు.. అలా బిజీ అయిపోయాడు నవీన్ పోలిశెట్టి. ఇక నవీన్ నటించిన 24 వెబ్ సిరీస్ తెలుగులో సీరియల్ గా ప్రసారం అయ్యింది. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ కు పెద్దగా ఆదరణ లభించలేదు. హిందీ వెబ్ సిరీస్ ను తెలుగులో డబ్ చేసి ప్లే చేయడం.. మన ఆడియన్స్ కు అది పెద్దగా రీచ్ అవ్వలేదు.
Also Read:ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియో.. చెన్నైలో తెలుగువారు నిర్మించిన అద్భుతం..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - హిట్ టాక్.. రూ.7 కోట్ల షేర్
ఇలా ఓ సీరియల్ సిరీస్ లో నటించిన అనుభవం కూడా ఉంది నవీన్ కు. ఆతరువాత నవీన్ పోలిశెట్టి కెరీర ను మలుపుతిప్పిన సినిమా ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో నవీన్ హీరోగా అంరదికి రిజిస్టర్ అయ్యాడు. అంతే కాదు ఈసినిమాతో ఫ్యాన్స్ ను కూడా సాధించాడు. ఇదే సినిమాతో హీరో కమ్ కమిడియన్ సుహాస్ కూడా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత ఈయనకి బాలీవుడ్ లో AIB అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం దక్కింది. ఒక పక్క తెలుగు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తూనే, బాలీవుడ్ లో ఇలాంటి షోస్ కి యాంకర్ గా చేసేవాడు. 2016 వ సంవత్సరం లో ఆయన 24 అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ ని తెలుగు దబ్ చేసి జీ తెలుగు లో కొంతకాలం టెలికాస్ట్ చేసారు. సీరియల్ లాగా టెలికాస్ట్ అయిన ఈ వెబ్ సిరీస్ మన తెలుగు ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేదు.
anushka, naveen
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నవీన్ పోలిశెట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆతరువాత చేసిన సినిమాుల కూడా అతని ఇమేజ్ ను పెంచాయి. మరీ ముఖ్యంగా జాతి రత్నాలు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. జాతిరత్నాలు సినిమా చూసి కడుపు పట్టుకుని నవ్వని ఆడియన్స్ లేరు.
అతని కామెడీ టైమింగ్ నవీన్ కు ఫ్యాన్స్ ను పెంచింది. ఈమధ్యలో అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు నవీన్. ఇక ప్రస్తుతం అనగనగ ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.