- Home
- Entertainment
- ప్రభాస్ తో ప్రేమ, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రభాస్ తో ప్రేమ, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రభాస్ తో లవ్ రూమర్స్ ఫేస్ చేసిన ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోయిన్లు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇష్టపడనివారు ఉండరు. ప్రభాస్ ను పిచ్చిగా ప్రేమించే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. సామాన్యులే కాదు అటు హీరోయిన్లు కూడా ప్రభాస్ తో నటించడానికి ఎగబడుతుంటారు. పాన్ ఇండియా హీరోలలో మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
ఏజ్ బార్ అవుతున్నా పెళ్ళి మాత్రం చేసుకోవడంలేదు ప్రభాస్. చాలామంది యంగ్ స్టార్స్ పెళ్ళెప్పుడు అంటే.. ప్రభాస్ చేసుకున్నాక అని సరదాగా చెపుతుంటారు. మరి ప్రభాస్ ను ఇలా అని అడిగితే.. నేను సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను అని కౌంటర్ ఇస్తున్నాడు. కాని అసలు పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు చేసుకుంటాడా లేదా అనే విషయం కూడా తెలియదు.
45 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసెత్తని ప్రబాస్
ప్రస్తుతం ప్రభాస్ కు 45 ఏళ్ళు. ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఎక్కువ. మరీ ముఖ్యంగా లేడీస్ లో ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్ వరకూ ప్రభాస్ అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. ప్రభాస్ తో నటిస్తూనే ఆయనతో ప్రేమలో పడ్డ హీరోయిన్లు ఎంతో మంది.
ఇలా ఎన్ని వార్తలు వచ్చినా ప్రభాస్ మాత్రం ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడు బయటపడలేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ కూడా లేదు. ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతాడు పెళ్లి ప్రశ్నలను మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. ఇక ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకం ఫ్యాన్స్ లో పోయింది.
ప్రభాస్ తో పాటు బ్యాచిలర్లుగా మిగిలిపోయిన హీరోయిన్లు
ప్రభాస్ మాత్రం సినిమాలపైనే పుల్ ఫోకస్ పెట్టేశాడు. 45 ఏళ్లు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు.. కాని ప్రభాస్ తో సినిమాలు చేసి.. ఆయనతో లవ్ ఎఫైర్ రూమర్స్ ఫేస్ చేసిన మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ప్రభాస్ ను గాఢంగా ప్రేమిస్తూ.. ప్రభాస్ లాగే బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారన్న గాసిప్ ఉంది. అసలు ఈ హీరోయిన్లు నిజంగా ప్రభాస్ ను ప్రేమించారా లేదా అనే విషయం అఫీషియల్ గా ఎవరికీ తెలియదు కాని.. ప్రభాస్ మాదిరిగా వీళ్లు కూడా 40 ఏళ్ళుదాటినా.. బ్యాచిలర్స్ గానే మాత్రం ఉన్నారు.
43 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని అనుష్క
ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు త్రిష, అనుష్క. అవును ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్ తో ప్రేమలో పడ్డారట. ఇద్దరు ప్రభాస్ తో సినిమా చేస్తున్న టైమ్ లో లవ్ రూమర్స్ గుప్పుమన్నాయి. మరీ ముఖ్యంగా అనుష్కతో అయితే పెళ్లి కూడా చేసుకున్నారన్నవార్తలు వచ్చాయి. అనుష్కతో పెళ్లి కోసమే ప్రభాస్ ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఉన్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాదు పెళ్లి తరువాత కలిసి ఉండటానికి వీరు అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారన్న వార్త ఒకప్పుడు తెగ తిరిగేసింది.
ప్రభాస్ తో పెళ్లి కోసమే 43 ఏళ్లు వచ్చినా అనుష్క వేరే పెళ్లి చేసుకోలేదు అని సోషల్ మీడియాలో గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. కొంత మంది ఫ్యాన్స్ ఇప్పటికే ప్రభాస్ తో అనుష్క పెళ్లిని ఏఐ టెక్నాలజీ వాడి చేసేశారు. ఆఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు కూడా. కాని వీరు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ప్రభాస్.. అనుష్క ఇద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించి మెప్పించారు.
42 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్ గా త్రిష బిజీ
ఇక ప్రభాస్ తో లవ్ ఎఫైర్ రూమర్స్ ఫేస్ చేసిన మరో హీరోయిన్ త్రిష. ఈ చెన్నై చిన్నది కూడా ప్రభాస్ ను ప్రేమించిందని టాక్. 42 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు త్రిష. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఏకైక నటిగా త్రిష రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ తో కలిసి ఆమె వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించింది. వర్షం సినిమా టైమ్ లోనే వీరిపై రకరకాల రూమర్స్ వచ్చాయి.
అప్పట్లో ప్రభాస్, త్రిష ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారన్నారని టాలీవుడ్ కోడై కూసింది. కొన్నాళ్లకు ఓ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్ధం జరిగినా. అదిపెళ్లి వరకూ వెళ్లలేదు. దాంతో అప్పటి నుంచి ఈ హీరోయిన్ సోలోగానే ఉంటోంది. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి ఊసు మాత్రం ఎత్తడంలేదు. వరుసగా సీనియర్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం తమిళ, మళయాల, తెలుగుసినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది.