- Home
- Entertainment
- ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లు వాళ్లతో సినిమా చేస్తే డిజాస్టర్ పక్కా? భయపెట్టే కాంబినేషన్ ఇవే
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లు వాళ్లతో సినిమా చేస్తే డిజాస్టర్ పక్కా? భయపెట్టే కాంబినేషన్ ఇవే
Stars Failure Combinations: ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఫెయిల్యూర్ ఫేస్ చేసిన కాంబినేషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఈ హీరోలు ఆ స్టార్స్ తో చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. అవేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

prabhas, ntr, ram charan
Stars Failure Combinations: సినిమాల్లో కాంబినేషన్స్ కి ప్రయారిటీ ఉంటుంది. ఆ కాంబినేషన్‌లో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా అనే టాక్ ఉంటుంది. అలాగే కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు వచ్చినా డిజప్పాయింట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌కి సంబంధించిన కాంబినేషన్లు ఇందులో ఉన్నాయి. మరి డిజప్పాయింట్ చేసే కాంబినేషన్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
prabhas, krishnam raju
ప్రభాస్ విషయంలో ఒక్క బ్యాడ్ సెంట్‌మెంట్ ఉంది. అయితే అది ఫ్యామిలీకి సంబంధించినది కావడం గమనార్హం. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి చేసిన సినిమాలు ఆడకపోవడమే కాదు. వీరిద్దరు కలిసి `రెబల్` చిత్రంలో నటించారు. ఆ మూవీ పరాజయం చెందింది. ఆ తర్వాత ఇటీవల మళ్లీ `రాధేశ్యామ్`లోనూ కలిసి నటించారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇది ఫెయిల్యూర్ కాంబినేషన్‌గా మిగిలిపోయింది. రెబల్ అభిమానులను నిరాశ పరిచింది.
Mehar Ramesh, ntr, Sakthi,
ఎన్టీఆర్ విషయంలో కూడా ఓ డిజాస్టర్ కాంబినేషన్ ఉంది. తారక్, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ డిజప్పాయింట్ చేశాయి. మొదట వీరి కాంబినేషన్‌లో `కంత్రి` సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. తారక్ మళ్లీ మెహర్ రమేష్‌కి ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత `శక్తి` మూవీ చేశారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ కాంబినేషన్ పై నెగటివ్ టాక్ పడిపోయింది. వీరి కాంబోలో సక్సెస్ లేదు.
kiara advani, ram charan
రామ్ చరణ్ కి హీరోయిన్ విషయంలో ఇలాంటి టాక్ ఉంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన సినిమాలు ఆడకపోవడమే అందుకు కారణం. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి మొదట `వినయ విధేయ రామ` చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా ఆడలేదు. ఇటీవల `గేమ్ ఛేంజర్` మూవీలో మరోసారి కలిసి నటించారు. ఇది కూడా డిజప్పాయింట్ చేసింది. దీంతో చరణ్, కియారా డిజాస్టర్ కాంబోగా నిలిచిపోయింది. వీరి కాంబినేషన్‌లో కూడా సక్సెస్ లేదు.
chiranjeevi, ram charan, srinu vaitla
మరోవైపు దర్శకుడు శ్రీనువైట్ల, మెగా ఫ్యామిలీ కాంబినేషన్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీనువైట్ల.. చిరంజీవితో `అందరివాడు` సినిమా చేశాడు. ఇది ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత శ్రీనువైట్ల రామ్ చరణ్‌తో సినిమా చేశాడు. `బ్రూస్ లీ`లో కలిసి నటించారు. ఈ సినిమా కూడా ఆడలేదు. మొత్తంగా శ్రీనువైట్ల మెగా ఫ్యామిలీ కి సెట్ కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి పాపులర్ అని చెప్పొచ్చు.
read more: అల్లు అర్జున్ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!
also read: గౌతమ్ హీరోగా మహేష్ బాబు, కృష్ణలతో సినిమా.. స్టార్ డైరెక్టర్ మైండ్ బ్లాక్ చేసే ప్లాన్, కానీ