- Home
- Entertainment
- Prabhas: నా కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్.. `స్పిరిట్` పోస్టర్‌పై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్.. రాజమౌళి కి షాక్
Prabhas: నా కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్.. `స్పిరిట్` పోస్టర్‌పై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్.. రాజమౌళి కి షాక్
Prabhas: ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి కలిసి `స్పిరిట్` మూవీకి సంబంధించిన క్రేజీ విషయాన్ని లీక్ చేశారు. ప్రభాస్ ఏకంగా తన కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్ అంటూ ప్రశంసలు కురిపించారు.

స్పిరిట్ ఫస్ట్ లుక్‌పై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్
ప్రభాస్ ప్రస్తుతం `ది రాజా సాబ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ఐపీఎస్ అధికారిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. ఆ మధ్య విడుదల చేసిన ఆడియో టీజర్ ఆకట్టుకుంది. అలాగే ఇటీవల కొత్త ఏడాది సందర్భంగా `స్పిరిట్` ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
నా కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్ - ప్రభాస్
తాజాగా ఈ లుక్‌పై ప్రభాస్ స్పందించారు. ఫస్ట్ టైమ్ ఆయన ఓపెన్ అయ్యారు. పోస్టర్‌పై క్రేజీ కామెంట్ చేశారు. తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ పోస్టర్ అని, కల్ట్ పోస్టర్ అంటూ కామెంట్ చేశారు. ఆ ఐడియా సందీప్‌కి ఎలా వచ్చిందోగానీ అదిరిపోయిందని చెప్పారు. తన పోస్టర్‌పైనే ఆయన తన రివ్యూ ఇవ్వం విశేషం.
సీన్‌లోనుంచే ఈ ఫస్ట్ లుక్ తీసుకున్నా - సందీప్ రెడ్డి వంగా
ఈ సందర్భంగా ఆ లుక్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా రియాక్ట్ అయ్యారు. అది ఒక సీన్‌లోని లుక్ అని, దాన్ని పోస్టర్‌గా డిజైన్ చేసిన్నట్టు చెప్పాడు. `బాహుబలి` లాంటి సినిమా వచ్చాక ప్రభాస్‌ని ఇంకా కొత్తగా, బాగా ఎలా చూపించాలనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందని, ఇలా చూపించినట్టు తెలిపారు. ఆయన పాత్ర తీరుతెన్నులకు ఇది అద్దం పడుతుందన్నారు. అదే సమయంలో చేతిలో మందు గ్లాస్ ఉండగా, అది లీటర్‌మందు బాటిల్ అని తెలిపారు. ఇందులో డిమ్రీ తృప్తి.. ప్రభాస్‌కి భార్యగా కనిపిస్తుందనే విషయం ఆయన చెప్పకనే చెప్పేశారు.
`ది రాజా సాబ్` టీమ్‌తో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ
ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్` మూవీ రేపు శుక్రవారం(జనవరి 9న) విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. దీన్ని తాజాగా విడుదల చేశారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇందులో `స్పిరిట్` గురించి పంచుకున్నారు ప్రభాస్. అలాగే సందీప్ రెడ్డి వంగా కొంత లీక్ ఇచ్చారు. దీనితో సినిమాపై అంచనాలను పెంచారు.
15ఏళ్ల తర్వాత ఇలాంటి ఫన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నా - ప్రభాస్
ఇక `ది రాజా సాబ్` గురించి చెబుతూ, తాను పదిహేనేళ్ల క్రితం `డార్లింగ్` అనే సినిమా చేశా. అది చాలా సరదాగా, ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాలు అవుతున్నాయి. డ్రైగా ఉంటుంది. దీంతో నాకే మళ్లీ `డార్లింగ్`లాగా ఒక మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ చేయాలనిపించింది. మారుతికి ఈ విషయాన్ని చెప్పాను, తాను ఈ కథని రెడీ చేశాడు. ఇదొక మంచి కామెడీ హర్రర్ మూవీ అవుతుంది అని తెలిపారు ప్రభాస్. షూటింగ్‌లో బాగా ఎంజాయ్ చేసినట్టు తెలిపారు. ప్రభాస్‌కి అమ్మాయిలంటే చాలా సిగ్గు ఎలా మ్యానేజ్ చేశారని హీరోయిన్లని సందీప్ అడగ్గా, మొదట్లో ఏం మాట్లాడలేదని, ఓ వారం తర్వాత నెమ్మదిగా మాట్లాడటం స్టార్ట్ చేశామని, ఆ తర్వాత వాళ్లు కూడా ఫ్రీ అయినట్టు తెలిపారు ప్రభాస్.

