- Home
- Entertainment
- Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన యష్.. `కేజీఎఫ్ 2`కి తాత
Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన యష్.. `కేజీఎఫ్ 2`కి తాత
Toxic Teaser Review: 'KGF' ఫేమ్ 'రాకింగ్ స్టార్' యష్ 'టాక్సిక్' (Toxic) సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో యశ్ పాత్ర ఎలా ఉంటుందో చూపించారు. చూడబోతుంటే ఇది `కేజీఎఫ్ 2`ని మించి ఉందనిపిస్తోంది.

`కేజీఎఫ్ 2`కి మూడేళ్ల తర్వాత `టాక్సిక్`తో వస్తోన్న యష్
యష్ `కేజీఎప్2` తర్వాత దాదాపు మూడేళ్లు ఒక్కే మూవీతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం `టాక్సిక్` అనే చిత్రంలో నటిస్తున్నారు. మహిళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భారీ తారాగణం ఉంది. హై టెక్నీకల్ వ్యాల్యూస్‌తో, అంతర్జాతీయ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ కూడా అదిరిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్లని పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్
నేడు యష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `టాక్సిక్` నుంచి అదిరిపోయే టీజర్ వచ్చింది. ఇందులో యష్ పాత్రని పరిచయం చేస్తూ ఈ టీజర్‌ని విడుదల చేశారు. `టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రాయ` పేరుతో దీన్ని విడుదల చేశారు. ఇందులో యష్ రాయ అనే పాత్రలో కనిపిస్తున్నారు. KGF తర్వాత యష్ ఈ చిత్రంలో గడ్డం, కొత్త హెయిర్‌స్టైల్, టాటూతో భిన్నంగా కనిపించారు. టోపీ, సిగార్, మెషిన్ గన్‌తో ఉన్న ఆయన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. `ఐ డోంట్ లైక్ వయొలెన్స్, వయొలెన్స్ లైక్స్ మీ` అని కేజీఎఫ్ 2లో డైలాగ్ ఉంటది. `టాక్సిక్` టీజర్ చూశాక దాన్ని యష్ సీరియస్‌గా తీసుకున్నారని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యశ్ భారీ యాక్షన్ సీన్లు చేశారు. KGF లాగే ఇక్కడ కూడా పెద్ద మెషిన్ గన్ వాడారు.
`టాక్సిక్` టీజర్‌లో ఏం చూపించారంటే
మాఫియా, గ్యాంగ్ స్టర్ కథతో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఓ క్రిస్టియన్ స్మశాన వాటికలో ఒకరిని పూడ్చేస్తున్నారు. అంతలోనే ఓ కారు వచ్చి చెట్టుని ఢీ కొట్టింది. అందులో ఒకతను డ్రింక్ తీసుకుంటూ బయటకొచ్చాడు. యష్ ఓ అమ్మాయితో రొమాన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆయా సీన్లు మతిపోయేలా ఉన్నాయి. అనంతరం బయటకు వచ్చి బాంబులు, తుపాకీ తుటాల వర్షం కురిపించాడు. దీంతో ప్రత్యర్థులంతా పడిపోతారు. చివర్లో డాడీస్ హోమ్ అని చెప్పడం విశేషం. యష్ బర్త్ డేకిది పర్‌ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.
అంతర్జాతీయ స్థాయి మేకింగ్
ఈ సినిమా నేపథ్య సంగీతం విజువల్స్‌కు సరిగ్గా సరిపోయింది. ఇది సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. టాక్సిక్ టీజర్ చూసిన నెటిజన్లు ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. వింటేజ్ లుక్ ఇచ్చే బ్రిటిష్ నేపథ్యంలో సినిమా తీసినట్టుంది. రొమాంటిక్ బాయ్‌గా పేరున్న యష్ ఈ సినిమాలో హాట్ సీన్‌లో కనిపించారు. ఈ సీన్ యానిమల్ సినిమాలోని రణబీర్ కపూర్‌ను గుర్తుచేస్తుంది. యప్ ఇంత బోల్డ్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. చూడబోతుంటే ఇది `కేజీఎఫ్ 2`కి తాతలా ఉందనిపిస్తుంది.
ఐదుగురు హీరోయిన్లతో యష్ రొమాన్స్
నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరందరి పోస్టర్లు, ఒకేలాంటి కాస్ట్యూమ్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాలో గ్లామర్‌కి కొదవలేదనిపిస్తుంది. 2026 మార్చి 19న ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

