MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నటి సూర్యకాంతంని పట్టుకుని రోడ్డుపైనే చెడా మడా వాయించిన మహిళ.. ఇంకా ఎన్ని కాపురాలు కూలుస్తావంటూ రచ్చ

నటి సూర్యకాంతంని పట్టుకుని రోడ్డుపైనే చెడా మడా వాయించిన మహిళ.. ఇంకా ఎన్ని కాపురాలు కూలుస్తావంటూ రచ్చ

SuryaKantham: తెలుగు తెరపై గయ్యాలి పాత్రలకు కేరాఫ్‌ నటి సూర్యకాంతం. ఆమెని ఓ మహిళ నిజంగానే తిట్టిందట. రోడ్డుపై మొహం పట్టుకుని చెడా మడా వాయించిందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
suryakantham

suryakantham

SuryaKantham: సూర్యకాంతం.. తెలుగు సినిమాలో ఈ పేరు చెబితే గయ్యాలి పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆమె గయ్యాలి అత్తగా వెండితెరపై చేసిన రచ్చ వేరే లెవల్. నిజంగానే గయ్యాలి అత్తా ఇలానే ఉంటుందనేలా, ఇంకా చెప్పాలంటే, వాళ్లని మించిపోయేలా తనదైన నటనతో పాత్రని రక్తికట్టిస్తూ మెప్పించింది. నిజంగానే గయ్యాలి అత్తగా పాపులర్‌ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేసిన నటి సూర్యకాంతం. సాధారణంగా సినిమాల్లో హీరోహీరోయిన్లు, విలన్లు ఉన్నాక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ లకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. కానీ ఆయా పాత్రలకు వన్నె తెచ్చిన నటి సూర్యకాంతం కావడం విశేషం.

పాత్రలో జీవించి నిజంగానే ఆమె ఇంత గయ్యాలిదా అని ఆడియెన్స్ చేత అనిపించుకున్న నటి కూడా ఆమెనే. సినిమాల్లో ఆమె పాత్ర చేసే గయ్యాలి తనం నచ్చని ఆడియెన్స్ రియల్‌ లైఫ్‌లోనూ ఆమెని అంతగా అసహ్యించుకున్నారంటే సూర్యకాంతం ఏ రేంజ్ లో పర్‌ఫెర్మెన్స్ ఇచ్చిందో ఊహించుకోవచ్చు. 
 

34
suryakantham

suryakantham

ఓ మహిళ నిజంగానే సూర్యకాంతంని పట్టుకుని తిట్టిందట. ఏం జరిగిందనేది చూస్తే, ఓ సారి సూర్యకాంతం మద్రాస్‌ నుంచి నెల్లూరు కారులో వెళ్తుందట. దారిలో ఓ చోట కారు ట్రబులిచ్చి ఆగిపోయిందట. డ్రైవర్‌ కారుని రిపేర్‌ చేసేపనిలో ఉన్నారు.

దీంతో సూర్యకాంతం కారు నుంచి దిగి రోడ్డుపై అటు ఇటు నడిచిందట. ఇంతలో అటునుంచే ఓ రిక్షా వెళ్లింది. కొద్ది దూరం వెళ్లి ఆ రిక్షా ఆగింది. అందులో నుంచి ఓ యాభై ఏళ్ల మహిళ సూర్యకాంతం వద్దకు నడుచుకుంటూ వచ్చింది. 

44
suryakantham

suryakantham

రావడం రావడంతోనే ఆమె కోపంతో ఊగిపోతుందట. `ఏవమ్మా నీకు ఇదేం మాయ రోగం, ఇలా ఎన్ని కాపురాలు కూలుస్తావ్‌. ఎంత మంది ఆడపడుచుల ఊసురుపోసుకుంటావ్` అంటూ తిట్లదండకం ప్రారంభించిందట. కోపంతో కాసేపు అరిచి వెళ్లిపోయిందట. కాసేపు సూర్యకాంతంకి కూడా ఏం అర్థంకాలేదు.

ఆమె వెళ్లిపోయాక ఆలోచించి నవ్వుకుందట. సినిమాల్లో తన పాత్రని అంతగా ఆమె రిసీవ్‌ చేసుకుందని, అంతగా ప్రేమించిందని, అందుకే తనపై ద్వేషం పెట్టుకుందని అనుకుని వెళ్లిపోయిందట. అది సూర్యకాంతం నటనలోనూ మ్యాజిక్‌ అని సినీ విశ్లేషకులు వెల్లడించారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.  

read  more: ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్‌.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

also read: ఇంత రేట్‌ అంటే నీ పెళ్లాం వదిలేసిపోతుంది, `అలేఖ్య చిట్టి పికిల్స్` పై ప్రియదర్శి మాస్‌ ట్రోలింగ్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image3
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved