- Home
- Entertainment
- Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్` లుక్ మైండ్ బ్లోయింగ్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్` లుక్ మైండ్ బ్లోయింగ్
ప్రభాస్ ప్రస్తుతం `ది రాజాసాబ్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు ప్రభాస్. క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు.

ది రాజా సాబ్‌తో రాబోతున్న ప్రభాస్
ప్రభాస్ ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన ప్రస్తుతం `ది రాజాసాబ్` చిత్రంలో నటించారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈసందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో `ది రాజా సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్విహించారు.
పెళ్లిపై స్పందించిన ప్రభాస్
ఈ ఈవెంట్‌లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇప్పటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలిపారు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ ఏజ్ 46ఏళ్లు. ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ లేడీ అభిమాని ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించింది. ప్రభాస్ పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని రాసిన ప్లకార్డ్ ని చూపించింది. ఇదే విషయాన్ని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి ప్రభాస్ స్పందించారు. తనకు కాబోయే లక్షణాలు చెప్పమంటే, `అదే తెలియక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు` అని చెప్పాడు ప్రభాస్. రెండు సార్లు ఇదే విషయాన్ని రిపీట్ చేశాడు. దీంతో అంతా షాక్ అయ్యారు.
పెళ్లిపై ప్రభాస్ సరదా కామెంట్
మొత్తంగా తన పెళ్లిపై ప్రభాస్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అయితే సరదాగా ఆయన ఈ సమాధానం చెప్పాడు తప్పితే, అందులో సీరియస్‌నెస్ లేదు. `కల్కి` ఈవెంట్‌లో లేడీ అభిమానుల కోసమే, మీరు ఫీల్ అవుతారనే పెళ్లి చేసుకోవడం లేదని వెల్లడించాడు ప్రభాస్. మొత్తంగా అభిమానులను ఆకట్టుకునే సమాధానం చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పడం లేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. మరోవైపు ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం ప్రభాస్ పెళ్లి కోసం టెంపుల్స్ తిరుగుతుండటం విశేషం.
స్పిరిట్ లుక్ లో ప్రభాస్ మైండ్ బ్లోయింగ్
ఇక `ది రాజాసాబ్` ఈవెంట్ కి ప్రభాస్ నయా లుక్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన గెడ్డం, పెద్ద మీసాలతో కనిపించారు. ఇది `స్పిరిట్` మూవీ లుక్ అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్స్ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్ నటిస్తున్నారు. ఆయనకు పై అధికారిగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఆ మధ్య ప్రభాస్, ప్రకాష్ రాజ్‌కి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆడియో గూస్ బంమ్స్ తెప్పించింది. ఇప్పుడు కొత్త లుక్‌లో, పైగా పవర్ ఫుల్ లుక్‌లో అభిమానులకు పూనకాలు తెప్పించారు ప్రభాస్. ఈ లుక్ మాత్రం అదిరిపోయింది. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

