SKN: శివాజీకి ఎస్‌కేఎన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్.. అనసూయ మాత్రం ఫుల్ హ్యాపీ
SKN: శివాజీ ఆడవాళ్ల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పుడు నిర్మాత ఎస్‌కేఎన్ కౌంటర్ ఇచ్చాడు. మతిపోయే సమాధానం చెప్పాడు.

అగ్గి రాజేస్తున్న శివాజీ వ్యాఖ్యలు
నటుడు శివాజీ వ్యాఖ్యలు సృష్టించిన అగ్గి ఇంకా ఆరడం లేదు సరి కదా, ఇంకా పెరుగుతున్నాయి. మరింత వివాదంగా మారుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు సెలబ్రిటీలు కౌంటర్లు ఇవ్వడంతో ఈ వివాదం పెరిగిపోతుంది. చిన్మయి, అనసూయ వంటి వారు స్పందించడం, వారికి శివాజీ కౌంటర్ ఇవ్వడంతో రచ్చ రాజుకుంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి శివాజీ రియాక్ట్ అయ్యాడు. తనపై కుట్ర చేస్తున్నారని కామెంట్ చేశారు.
శివాజీకి ఎస్‌కేఎన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్
ఈ క్రమంలో ఇప్పుడు శివాజీకి మరో క్రేజీ కౌంటర్ పడింది. మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చాడు నిర్మాత ఎస్‌కేఎన్. అమ్మాయిలు మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలని తెలిపారు. ఏ బట్టల సత్తిగాడి మాట వినకండి అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి ఇంతకి ఎస్‌కేఎన్ ఏమన్నాడో చూస్తే, ఆయన తాజాగా `పతంగ్` మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. సినిమాకి అభినందనలు తెలిపారు. సినిమాని చూసేందుకు తనవంతు సపోర్ట్ ని అందించబోతున్నారు. ఫ్రీగా షో చూపించబోతున్నాడు.
ఏ బట్టలసత్తి గాడి మాటలు వినకండి
ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, హీరోయిన్‌ని ఉద్దేశించి చెబుతూ, మామూలు డ్రెస్ వేసుకుని వచ్చావ్, కాస్త గ్లామర్ డ్రెస్ వేసుకొని రావాల్సింది. హీరోయిన్లు ఏ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటే అవి వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెంట్‌గా ఉంటే దాన్ని వేసుకోండి` అని తెలిపారు ఎస్ కేఎన్. అదే సమయంలో `ఈ విషయంలో ఏ బట్టల సత్తి గాడి మాట వినకండి` అంటూ కౌంటర్ ఇచ్చాడు. `ఏది జరిగినా మన మనసు మంచిది అయితే మంచిగా ఉంటాం. మన ఆలోచనలు మంచివి అయితే మంచి జరుగుతుంది తప్ప డ్రెస్సుల్లో ఏం ఉండదు` అని ఎస్‌కేఎన్ తెలిపారు.
అనసూయ ఫుల్ హ్యాపీ
మొత్తంగా శివాజీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ఎస్‌కేఎన్. ఇప్పుడు ఎస్‌కేఎన్ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. చూడబోతుంటే ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఇప్పుడు దీనికి అనసూయకి హ్యాపీ కావడం విశేషం. అనసూయ కూడా నా బట్టలు నా ఇష్టం అని ఆమె శివాజీకి కౌంటర్ ఇచ్చింది. నానా రకాలుగా శివాజీని ఆడుకుంది. ఆ తర్వాత అనసూయ ఆంటీని తర్వాత కలుస్తా అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఆమె రెచ్చిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎస్‌కేఎన్ కూడా అమ్మాయిలకు సపోర్ట్ గా కామెంట్ చేయడంతో అనసూయ హ్యాపీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
శివాజీ అమ్మాయిల గురించి ఏం కామెంట్ చేశాడంటే
`దండోరా` ఈవెంట్లో యాంకర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, `అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుంటే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా, ఏం అనుకోవద్దు. హీరోయిన్లు అందరూ.. మీరు ఏం అనుకున్నా పర్వాలేదు. లాగి పీకుతాం. అది వేరే విషయం. కానీ, మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది కానీ, సామాన్లు కనిపించే దానిలో ఏమీ ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది ఎదురుగా నవ్వుతూ మాట్లాడతారు కానీ, మనసులో దరిద్రపు ముండ, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావ్ ? బానే ఉంటావ్ కదా ? ఇలాంటి మాటలు అనాలనిపిస్తది లోపల. అనలేం. అంటే స్త్రీ స్వాతంత్రం లేదా? స్వేచ్ఛ లేదా అని అంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ అంటే మా అమ్మ... చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతుంది` అని తెలిపారు శివాజీ. ఇవే వివాదానికి కారణమయ్యాయి.

