- Home
- Entertainment
- Allu Arjun: మెగాస్టార్ కొడుకు అయినా దుల్కర్ సల్మాన్ వినయంగా ఉంటారు..ఆకాశంలో ఒక తార ఈవెంట్ లో అల్లు అర్జున్
Allu Arjun: మెగాస్టార్ కొడుకు అయినా దుల్కర్ సల్మాన్ వినయంగా ఉంటారు..ఆకాశంలో ఒక తార ఈవెంట్ లో అల్లు అర్జున్
మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడైనప్పటికీ దుల్కర్ సల్మాన్ ఎంతో వినయంగా ఉంటారని అల్లు అర్జున్ ప్రశంసించారు. ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తెలుగులో దుల్కర్ సల్మాన్ క్రేజ్
తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోలు చాలా మంది తెలుగులో క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో పాపులర్ అయిన వాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా దుల్కర్ నటించిన తెలుగు సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన మరో తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ స్పీచ్
ఈ నేపథ్యంలో నవంబర్ 15న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుల్కర్ సల్మాన్ చేసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బావుంటుంది. తెలుగులో ఆయన హిట్ చిత్రాల లిస్ట్ పెరుగుతోంది.
మెగాస్టార్ కొడుకు అయినా వినయంగానే..
కేరళలో పెద్ద మెగాస్టార్ మమ్ముట్టి గారి కొడుకే దుల్కర్. మీ అందరికీ తెలుసు. కానీ ఆయన చాలా వినయంగా ఉంటారు. దుల్కర్ స్టార్ కిడ్ అయినప్పటికీ అలాంటి ఫీలింగ్ చూపించడు అంటూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాన్న చాలా ఆసక్తిగా ఉన్నారు
ఆకాశంలో ఒక తార సినిమా షూటింగ్ నుంచి మా నాన్న అల్లు అరవింద్ గారు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పేవారు. నాన్న సినిమా రషెష్ చూస్తే చాలు ఆయన ఒపీనియన్ జెన్యూన్ గా చెప్పేస్తారు. ఈ సినిమాకి ఆయన చాలా ఎగ్జైటెడ్ గా ఉండడం చూశాను. నా సినిమాలకు కూడా ఎప్పుడూ ఆయన అంత ఎగ్జైటెడ్ గా కనిపించలేదు అంటూ బన్నీ సరదాగా కామెంట్స్ చేశారు.













