- Home
- Entertainment
- మూవీ రివ్యూలతో ఈ రేంజ్ లో సంపాదించొచ్చా ? పోలీసుల అదుపులో 'పూలచొక్కా' నవీన్.. నిర్మాతని ఎలా బెదిరించాడంటే
మూవీ రివ్యూలతో ఈ రేంజ్ లో సంపాదించొచ్చా ? పోలీసుల అదుపులో 'పూలచొక్కా' నవీన్.. నిర్మాతని ఎలా బెదిరించాడంటే
యూట్యూబర్ పూల చొక్కా నవీన్ ఓ మూవీ రివ్యూ కోసం భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడని నిర్మాత కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబర్ గా ఫేమస్ అయిన పూల చొక్కా నవీన్
యూట్యూబ్ లో సినిమా రివ్యూలు చెబుతూ చాలా మంది యూట్యూబర్ లు ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరే పూల చొక్కా నవీన్. పూల చొక్కా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సినిమాలు రివ్యూలు చెబుతుంటాడు నవీన్. అతడికి యూట్యూబ్ లో ఏకంగా 6 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అతడి వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోంది.
వర్జిన్ బాయ్స్ రివ్యూ కోసం 40 వేలు డిమాండ్ ?
అయితే ఇటీవల వర్జిన్ బాయ్స్ అనే చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత రాజా దారపునేని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ పై కేసు నమోదు నమోదు చేశారు. వర్జిన్ బాయ్స్ చిత్రానికి పాజిటివ్ గా రివ్యూ ఇవ్వాలంటే తనకి రూ.40 వేలు ఇవ్వాలని నవీన్ డిమాండ్ చేశాడని, అంత డబ్బు ఇవ్వకుంటే నెగిటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. అందుకే తాను పోలీసులని ఆశ్రయించినట్లు నిర్మాత రాజా తెలిపారు.
పోలీసుల అదుపులో నవీన్
నిర్మాత ఫిర్యాదుతో పోలీసులు నవీన్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రేక్షకులు ఇలాంటి రివ్యూలు చూసి మోసపోవద్దని నిర్మాత కోరారు. నవీన్ ఒక్కో రివ్యూకి ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నవీన్ రివ్యూలు మాత్రమే కాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాడు. గతంలో తాను చిత్ర పరిశ్రమలో పనిచేసినట్లు కూడా నవీన్ గతంలో తెలిపారు.
నవీన్ రియాక్షన్ ఇదే
అయితే నిర్మాత ఆరోపణలపై నవీన్ స్పందించారు. అతడి వెర్షన్ వేరే విధంగా ఉంది. ‘’వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ తనకి కాల్ చేసి ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేయాలని కోరారు. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగారు. నేను ఒక అమౌంట్ చెప్పాను. మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు ఫోన్ చేసి.. వర్జిన్ బాయ్స్ మూవీ చూసి రివ్యూ పాజిటివ్ గా చెప్పండి అని అడిగారు. సినిమా చూసి నచ్చితే పాజిటివ్ గా చెబుతా, నచ్చకుంటే ఉన్నది ఉన్నట్లు జెన్యూన్ గా చెబుతా అని చెప్పా. పెయిడ్ రివ్యూలు చేయను అని చెప్పా" అని తెలిపారు.
నిర్మాత అసత్య ఆరోపణలు చేస్తున్నారు
ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివరిస్తూ..''ఆ మూవీ చూశాను, నాకు నచ్చలేదు. దీనితో రివ్యూ కూడా అలాగే చెప్పాను. దీనితో నిర్మాత కక్ష కట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ప్రమోషన్స్ కి డబ్బులు అడిగిన విషయాన్ని రివ్యూకి అడిగినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు'' అని పూలచొక్కా నవీన్ తెలిపారు. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి.