- Home
- Entertainment
- నాగార్జున మూవీ సీన్ మొత్తం కాపీ కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్.. ఆ సినిమా ఏంటో తెలుసా
నాగార్జున మూవీ సీన్ మొత్తం కాపీ కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్.. ఆ సినిమా ఏంటో తెలుసా
అక్కినేని నాగార్జున 1988లో నటించిన ఒక చిత్రంలోని సన్నివేశాలని పాన్ ఇండియా డైరెక్టర్ ఒకరు కాపీ చేశారు. ఆయన రూపొందించిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

కింగ్ నాగార్జున కెరీర్ లో లవ్ రొమాంటిక్ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నాగార్జున మహిళా ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆదరణ పొందారు. అభిమానులు ఆయన్ని మన్మథుడు అని పిలుస్తుంటారు. కెరీర్ బిగినింగ్ లో నాగార్జున కోడి రామకృష్ణ దర్శకత్వంలో మురళీ కృష్ణుడు అనే చిత్రంలో నటించారు. ఈ మూవీలో నటి రజనీ హీరోయిన్. గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి కీలక పాత్రల్లో నటించారు.
1998లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక లవ్ సీన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ రజనీ ఓ డ్రామా కంపెనీలో డ్యాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి తన అవసరాల కోసం, డ్రామా కంపెనీలో బిల్డప్ కోసం పెద్ద కంపెనీకి ఓనర్ అయిన మురళి కృష్ణ (నాగార్జున) తన లవర్ అని చెప్పుకుంటుంది. తన పేరు వాడుకుంటోంది అని ఆమె గురించి నాగార్జునకి తెలుస్తుంది.
తాను కూడా నాటకం ఆడి ఆమె గురించి తెలుసుకోవాలని నాగార్జున ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆమె ఆత్మాభిమానం గల మంచి అమ్మాయి అని నాగార్జునకి అర్థం అవుతుంది. దీనితో ఆమెతో ప్రేమలో పడతాడు. తానే మురళీకృష్ణ అని చెప్పకుండా సామాన్యుడిగా ఆమెతో ట్రావెల్ చేస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది.
ఇంతలో డ్రామా కంపెనీ ఓనర్ ఒక పార్టీ ఏర్పాటు చేసి దానికి మురళీ కృష్ణని అతిథిగా పిలవాలని హీరోయిన్ ని అడుగుతారు. దీనితో ఆమె చిక్కుల్లో పడుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా నాగార్జున ఒక ఐడియా చెబుతాడు. తానే పార్టీలో మురళీకృష్ణ లాగా నటిస్తానని, వాళ్ళని నమ్మిస్తానని చెబుతాడు. కంగారు పడుతూ హీరోయిన్ అందుకు అంగీకరిస్తుంది. పార్టీలో ఆ కంపెనీ ఓనర్.. కళల అభివృద్ధి కోసం నాగార్జునని డొనేషన్ అడుగుతారు.
వెంటనే నాగార్జున రూ.2 లక్షల చెక్కు రాసి ఇస్తాడు. దీనితో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆరా తీస్తే అతడే నిజమైన మురళి కృష్ణ అని హీరోయిన్ కి తెలుస్తుంది. ఈ సీన్ ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. అవును ఇదే సన్నివేశాన్ని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గజినీ చిత్రంలో కాపీ కొట్టారు. మక్కీకి మక్కీ ఇలాంటి సన్నివేశమే గజినీ చిత్రంలో అసిన్, సూర్య మధ్య ఉంది. గజినీ మూవీ తెలుగు తమిళ భాషల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అదే చిత్రాన్ని మురుగదాస్ హిందీలో 2008లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. అప్పట్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. హిందీలో గజినీ 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ విధంగా గజినీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించింది.