పూజా హెగ్డేకు పెద్ద షాక్ , కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ కు ఎదురుదెబ్బ
వరుస ప్లాప్ లతో ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోతూ వస్తోంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోయన్ కు డోర్స్ క్లోజ్ అయినట్టే కనిపిస్తుంది. ఇక కోలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి అనుకుంటే అక్కడ కూడా పూజాకు పెద్ద షాక్ తగిలింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది పూజా హెగ్డే. ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్‌లో వెనుకపడుతోంది బ్యూటీ. ఒకదశలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించిన పూజా.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుండటం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పూజాకు దక్కాల్సిన ఓ గోల్డెన్ ఛాన్స్ ఆమె చెయిజారినట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుసగా హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్ట్స్ సినిమా దర్శకుడు విగ్నేష్ రాజా తో చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫస్ట్ ఫిక్స్ చేశారు టీమ్. తమిళంలో వరుసగా ఆమె సినిమాలు చేస్తుండటంతో ధనుష్ సినిమా కోసం పూజాకు ఆఫర్ రెడీ చేశారట. కాని అక్కడ కూడా వరుసగా పూజా సినిమాలన్నీ ప్లాప్ అవుతుండటంతో పూజాను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. అంతే కాదు పూజా ప్లేస్ లో మలయాళ నటి మమితా బైజును ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. .
ఇక పూజా హెగ్డే కు చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, వరుసగా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. హ్యాట్రీక్ ఫెయిల్యూర్ చూసిన తరువాత పూజాకు ఆఫర్లు తగ్గిపోయాయి. అంతే కాదు రీసెంట్ గా విడుదలైన ‘రెట్రో’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఆమె మార్కెట్‌లో క్రేజ్ తగ్గింది. ఇక విజయ్ దేవరకొండతతో జనగణమణ ఆగిపోవడం, మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తూనే మధ్యలో తప్పుకోవడం.. ఇలా ఎటు చూసుకున్నా పూజా కెరీర్ కు అన్నీ మైనస్ అయ్యాయి.
ఒకప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్ట్‌ను కోల్పోవడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. మరోవైపు, మమితా బైజు తాజాగా వచ్చిన ‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమాతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న ఆమె ప్రస్తుతం దళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకుంది. తాజాగా పూజా హెగ్డే చేయాల్సిన ధనుష్ సినిమా అవకాశం కూడా మమితా దక్కించుకోవడంతో ఆమె కెరీర్ పరుగులు పెట్టబోతోంది.
ఇక ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వనుంది. మమితా బైజు ఇందులో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం తన చేతిలో ఉన్న కొన్ని ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టి, మళ్లీ పుంజుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.