75ఏళ్ల నటుడితో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్.. రిస్క్ చేయడం కాదు, లక్కీ ఛాన్స్ !
Pooja Hegde: తెలుగు తెర బుట్టబొమ్మ పూజాహెగ్డే `రంగస్థలం`లో ఐటెమ్ సాంగ్ చేసి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆమెస్పెషల్ సాంగ్ చేస్తుందట. అయితే 75 ఏళ్ల నటుడుతో ఆడిపాడబోతుందట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pooja Hegde
తెలుగు ఆడియెన్స్ పూజా హెగ్డేని ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆమెని బుట్టబొమ్మగా వర్ణించారు. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల పూజా హెగ్డే కెరీర్ కాస్త డౌన్ అయ్యింది. వరుస పరాజయాలు ఆమెని బ్యాక్ చేశాయి.
ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుంది. వరుసగా సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె విజయ్ తో `జన నాయగన్` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాతో మళ్లీ తాను పుంజుకోవాలని చూస్తుంది పూజా.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఐటెమ్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యిందట. గతంలో రామ్ చరణ్ `రంగస్థలం` సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఉర్రతలూగించింది. సుకుమార్ రూపొందించిన ఈ మూవీలో `జిగేల్ రాణి` అంటూ సాగే పాటలో పూజా స్టెప్పులకు కుర్రకారు, మాస్ ఆడియెన్స్ ఊగిపోయారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో కాదు, దాన్ని మించిన ఐటెమ్ సాంగ్ చేయబోతుందట.
coolie
అయితే 75ఏళ్ల నటుడి పక్కన పూజా ఐటెమ్ సాంగ్ చేయబోతుండటం విశేషం. మరి ఆ నటుడు ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఏజ్ ఇప్పుడు 75 కావడం విశేషం. రజనీ ప్రస్తుతం `కూలీ` చిత్రంలో నటిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తన ఎస్‌సీయూ నుంచి వస్తోన్న మూవీ ఇి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడ కనిపిస్తారని సమాచారం.
Lokesh Kangaraj, Rajinikanth
ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందులో పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టు సమాచారం. అదిరిపోయే మాస్ సాంగ్‌ని డిజైన్ చేస్తున్నారట. సినిమాకే ఇది హైలైట్ గా ఉంటుందని, ఇందులో ఇందులో నటించే మెయిన్ కాస్టింగ్‌అంతా కనిపిస్తారని సమాచారం.
ఈ పాట మాత్రం వేరే లెవల్‌లో ఉంటుందని సమాచారం. పూజా డాన్సులు, అందాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతాయి. ఇది వర్కౌట్ అయితే, సినిమా హిట్ అయితే పూజాకి పూర్వ వైభవం రావడం పక్కా అంటున్నారు. మరి ఈ ఆఫర్‌లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: రెస్టారెంట్లు నడుపుతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా? తెర వెనుక వ్యాపారం పెద్దదే!
also read: 4600 కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరో తెలుసా? టాప్ 10 లిస్ట్